Dhurandhar: 'ధురంధర్' తెలుగు రిలీజ్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

బాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ధురంధర్, రణవీర్ సింగ్ హీరోగా, రెండో శనివారం Rs. 55 కోట్లు కలెక్షన్ చేసి మొత్తం Rs. 300 కోట్లు దాటింది. దింతో సినిమా తెలుగు వెర్షన్‌లో కూడా త్వరలో విడుదల కానుందని టాక్ వినిపిస్తోంది.

New Update
Dhurandhar

Dhurandhar

Dhurandhar: బాలీవుడ్ హిట్ మూవీ ధురంధర్, రణవీర్ సింగ్ హీరోగా నటించిన చిత్రం, బాక్స్ ఆఫీస్‌ వద్ద అద్భుత విజయాన్ని అందుకుంటోంది. సినిమా విడుదల తరువాత రెండవ శనివారం Rs. 55 కోట్లు నెట్ కలెక్షన్ సాధించి హిందీ సినిమాలలో రికార్డు స్థానం దక్కించుకుంది.

మొత్తం కలెక్షన్లు Rs. 300 కోట్లు నెట్ దాటాయి. ఈ విజయం నేపథ్యంలో, ఇప్పుడు తెలుగు వెర్షన్‌లో సినిమా విడుదల కానుందని బలమైన టాక్ వినిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులు కూడా రణవీర్ సింగ్ నటించిన ఈ యాక్షన్-ఎంటర్టైనర్‌ను వీక్షించేందుకు సిద్ధంగా ఉన్నారని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఈ సినిమా తెలుగులో ఎప్పుడు రానుందో అధికారిక ప్రకటన త్వరలో వెల్లడిస్తారని అంటున్నారు. తెలుగు వెర్షన్ ద్వారా, ధురంధర్ సక్సెస్ రెట్టింపు అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

Advertisment
తాజా కథనాలు