Nagavamsi: ఆ హీరోతో నేను తీయబోయే సినిమా 'అర్జున్ రెడ్డి'ని మించి ఉంటుంది: నాగవంశీ

నిర్మాత నాగవంశీ.. సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన కొన్ని డీటెయిల్స్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ 'అర్జున్ రెడ్డి' తరహాలో ఉంటుంది. సిద్ధూకి ఈ కథపై చాలా ఆసక్తి ఉంది. ఈ సినిమాలో సిద్ధూని కొత్త రూపంలో చూస్తారని అన్నారు.

New Update
nagavamsi about his upcoming movie

nagavamsi about his upcoming movie

టాలీవుడ్ లో చాలాకాలం పాటూ సైడ్ యాక్టర్ గా చేసి 'డీజే టిల్లు' సినిమాతో స్టార్ బాయ్ గా మారాడు సిద్దు జొన్నలగడ్డ. ఈ మూవీలో సిద్దు ఫెర్ఫార్మెన్స్ కి యూత్ ఆడియన్స్ అడిక్ట్ అయిపోయారు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన 'టిల్లు స్క్వేర్' అంతకు మించి భారీ విజయాన్ని సొంతం చేసుకొని నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. 

Also Read :  'అన్ స్టాపబుల్' సెట్స్ లో రామ్ చరణ్.. వైరల్ అవుతున్న వీడియోలు

ఈ సక్సెస్ తో స్టార్ డం సంపాదించుకున్న సిద్ధు.. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు. ప్రెజెంట్ ఈ హీరో చేతిలో తెలుసు కదా, జాక్, కోహినూర్ అనే సినిమాలున్నాయి. అయితే ఇవే కాకుండా సిద్ధుతో 'డీజే టిల్లు' సినిమాను నిర్మించిన నాగవంశీ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. 

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.." సిద్దూతో మేము ఓ కొత్త సినిమా చేయబోతున్నాం. ఇది 'అర్జున్ రెడ్డి' తరహా ప్రాజెక్ట్. ప్రస్తుతానికి కథా చర్చలు జరుగుతున్నాయి, ఇంకా పూర్తి స్థాయిలో ఫిక్స్ కాలేదు. సిద్ధూకి కూడా ఈ కథపై చాలా ఆసక్తి ఉంది.

డిఫరెంట్ సిద్ధుని చూస్తారు..

ఇప్పటివరకు సిద్ధూని ఒక కోణంలో చూశారు, కానీ ఈ సినిమాలో ఆయనను పూర్తిగా కొత్త రూపంలో చూస్తారు. ఈ కథతో సినిమా చేయడం ఖాయం. హిట్ అయితే కొత్తగా ప్రయోగం చేశారని, ప్లాప్ అయితే రిస్క్ తీసుకున్నారని అందరూ మాట్లాడతారు. ఏదేమైనా, ఏదేమైనా ఈ కథతో మాత్రం సినిమా చేసి తీరుతాం.." అని అన్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read : మరో వివాదంలో చిక్కుకున్న మంచు ఫ్యామిలీ

Also Read :  ఏపీలో మందుబాబులకు అదిరిపోయే శుభవార్త.. రెండు రోజులు పండగే పండగ

Advertisment
తాజా కథనాలు