/rtv/media/media_files/2024/12/31/Tdh9APvTB9BY2bFIvShN.jpg)
ram charan at unstoppable shooting
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా చిత్రం 'గేమ్ ఛేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో, సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రామ్ చరణ్ ప్రముఖ టాక్ షో అన్‌స్టాపబుల్' సందడి చేయనున్నారు. ఈ ఎపిసోడ్ కోసం షూటింగ్ మంగళవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహిస్తున్నారు. రామ్ చరణ్ ఇప్పటికే స్టూడియోకి చేరుకుని, షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Also Read : మరో వివాదంలో చిక్కుకున్న మంచు ఫ్యామిలీ
ఆయన కారులో నుండి బయటకు దిగుతూ, వేదిక వైపుగా నడుస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సెట్స్ లో ఎంట్రీ ఇవ్వగానే బాలయ్యను కలిశారు రామ్ చరణ్. దీంతో బాలయ్య ' సంక్రాంతికి వస్తున్నాం.. అని మీడియాకి చెప్పారు. 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్' రెండు సినిమాలు సక్సెస్ కావాలని కోరుకున్నారు.
గేమ్ ఛేంజర్ &డాకు మహారాజ్ .. సంక్రాంతికి వస్తున్నాం..
— RTV (@RTVnewsnetwork) December 31, 2024
అన్ స్టాపబుల్ సెట్స్ లో రాంచరణ్.. #RamCharan𓃵 #DakuMaharaaj #UnstoppableWithNBK #RTV pic.twitter.com/UovDmmZwSX
బాలయ్య ఈ షోలో రామ్ చరణ్‌ను ఎలాంటి ప్రశ్నలు అడిగారు? చరణ్ వాటికి ఎలాంటి ఆన్సర్ ఇచ్చారో తెలియాలంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ వరకు వేచి చూడాల్సిందే. కాగా రామ్ చరణ్ 'అన్ స్టాపబుల్' షోకి రావడం ఇదే మొదటి సారి.
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో పాల్గొనేందుకు షూటింగ్ కోసం వచ్చిన రాంచరణ్..#RamCharan𓃵 #UnstoppableWithNBK #NandamuriBalakrishna #RTV pic.twitter.com/90NFY88ssM
— RTV (@RTVnewsnetwork) December 31, 2024
గత సీజన్‌లో ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు, ఆయన రామ్ చరణ్‌తో ఫోన్‌లో బాలయ్యతో మాట్లాడారు. అప్పుడు బాలకృష్ణ, “నా షోకు ఎప్పుడు వస్తావు?” అని అడగ్గా.. చరణ్, “మీరు పిలవడమే ఆలస్యం” అని అన్నారు. ఎట్టకేలకు ఆ సమయం ఇప్పుడు వచ్చింది. కాగా ఈ ఎపిసోడ్‌లో రామ్ చరణ్‌తో పాటు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.