/rtv/media/media_files/2025/07/30/vijay-rashmika-2025-07-30-16-07-40.jpg)
vijay- rashmika
'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాలతో బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడీగా పేరు పొందారు విజయ్ దేవరకొండ- రష్మిక. ఈ సినిమాల్లో వీరిద్దరి కెమిస్ట్రీ, స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ జంట మళ్ళీ కలిసి స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. విజయ్ దేవరకొండ రాబోయే చిత్రం 'VD14'లో రష్మిక హీరోయిన్ గా నటించబోతున్నారనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
'శ్యామ్ సింగరాయ్', 'టాక్షీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఏ చిత్రాన్ని గతేడాది మేలో అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా.. అందులో విజయ్ కండలు తిరిగిన బాడీతో ఫుల్ బెస్ట్ మోడ్ లో కనిపిస్తూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు. 19వ శతాబ్దంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్ర షూటింగ్ గత వారంలోనే ప్రారంభం కావాల్సి ఉండగా.. విజయ్ డెంగ్యూ బారిన పడడంతో షూటింగ్ వాయిదా పడింది. విజయ్ కోలుకోగానే షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం.
Also Read : ఇక నుంచి బెట్టింగ్ ప్రచారం చేయను : ప్రకాష్ రాజ్
డేటింగ్ రూమర్స్..
అయితే గత కొంతకాలంగా విజయ్- రష్మిక రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి మళ్ళీ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారనే వార్త ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. రష్మిక- విజయ్ తరచూ ఒకే బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న వెకేషన్ ఫొటోలను ఒకేసారి వేరువేరుగా షేర్ చేయడం, విజయ్ ఇంట్లో రష్మిక పండగలు సెలెబ్రేట్ చేసుకోవడం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే పుకార్లకు తెరలేపింది. అంతేకాదు పలు ఇంటర్వ్యూలో రిలేషన్ షిప్ గురించి ప్రశ్నలు అడగ్గా వీరు చెప్పే సమాధానాలు కూడా అలాగే ఉన్నాయి. రీసెంట్ గా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రశ్మికను మీకు ఇష్టమైన పర్సన్ ఎవరని అడగ్గా.. అదెవరో మీ అందరికీ తెలుసు అని బదులిచ్చింది. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే వార్త నిజమేనని ఫిక్స్ అయిపోతున్నారు నెటిజన్లు.
రేపే విడుదల
ఇదిలా విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'కింగ్డమ్' మరో 24 గంటల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. గ్యాంగ్ స్టార్ డ్రామా, అన్నదమ్ముల సెంటిమెంట్ తో రూపొందిన ఈ చిత్రన్ని గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. 2.40 నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పలు కట్స్, మార్పుల తర్వాత 'కింగ్డమ్' చిత్రానికి సెన్సార్ బోర్లు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇందులో విజయ్ దేవరకొండ సరసన భాగ్య శ్రీ ఫీమేల్ లీడ్ గా యాక్ట్ చేసింది. సత్యదేవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.
Also Read: Janhvi Kapoor: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్
latest-telugu-news | telugu-cinema-news | telugu-film-news | Vijay Devarakonda | actress-rashmika-mandanna | 2025 Tollywood movies | latest tollywood updates