Raja Saab Songs: ‘ది రాజా సాబ్’ కోసం గడ్డకట్టే చలిలో ప్రభాస్ షూటింగ్.. మారుతి షాకింగ్ కామెంట్స్!

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ కోసం విదేశాల్లో గడ్డకట్టే చలిలో షూటింగ్ చేసారని మారుతి తెలిపారు. ‘రెబెల్ సాబ్’ పాటలో 1000 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. ఈ భారీ కమర్షియల్ సినిమా జనవరి 9, 2026న విడుదల కానుంది. ఇదే రోజున విజయ్ ‘జనా నాయకన్’తో బాక్సాఫీస్ పోటీ ఉంటుంది.

New Update
Raja Saab Songs

Raja Saab Songs

Raja Saab Songs: ప్రభాస్(Prabhas) నటిస్తున్న హారర్- ఫాంటసీ చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab) గురించి రోజురోజుకు కొత్త వివరాలు బయటకు వస్తున్నాయి. తాజాగా సినిమా టీమ్ తెలుపుతున్న సమాచారం అభిమానుల్లో మరింత ఉత్సాహం పెంచింది. ముఖ్యంగా పాటల షూటింగ్ సమయంలో ప్రభాస్ ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

గడ్డకట్టే చలిలో పాటల షూటింగ్ చేసిన ప్రభాస్

హైదరాబాద్‌లో సినిమా మొదటి పాట ‘రెబెల్ సాబ్’ విడుదల వేడుకలో దర్శకుడు మారుతి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ పాటతో పాటు మరికొన్ని సాంగ్స్‌ను విదేశాల్లో చాలా చల్లని వాతావరణంలో తెరకెక్కించారన్నారు. అక్కడ ఉష్ణోగ్రతలు గడ్డ కట్టేంత వరకు పడిపోయినా, ప్రభాస్ మాత్రం ఒక్కసారి కూడా షూటింగ్ ఆపాలని అనలేదని తెలిపారు. మారుతి మాట్లాడుతూ.. “ఇంతకాలం ఫ్యాన్స్ మిస్ అయిన ఆనందం అంతా ఈ సినిమా ద్వారా ఇచ్చేలా పని చేద్దాం” అని ప్రభాస్ టీమ్‌ను ప్రోత్సహించారని చెప్పారు.

Also Read: టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతోన్నరేణు దేశాయ్..? లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

స్టార్ కాస్ట్‌తో భారీ ప్రాజెక్ట్

ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్‌తో పాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇది పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుండగా, రొమాంటిక్ పాటలు, ఇంట్రడక్షన్ సాంగ్, మాస్ నంబర్ అన్ని ఉండనున్నాయి.

Also Read: NBK 111 క్రేజీ అప్‌డేట్.. మరోసారి డ్యూయల్ రోల్‌లో బాలయ్య నట విశ్వరూపం..!

1000 మంది డ్యాన్సర్లతో భారీ సాంగ్

నిర్మాత విశ్వప్రసాద్ చెప్పిన మరో ముఖ్య విషయం ఏమిటంటే ‘రెబెల్ సాబ్’ పాటలో దాదాపు 1,000 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. ఇది ఇటీవలి తెలుగు చిత్రాల్లో చిత్రీకరించిన అతిపెద్ద సాంగ్స్‌లో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. అలాగే, ఈ సినిమా ప్రభాస్ ఎక్కువ రోజులు పనిచేసిన ప్రాజెక్టులలో ఒకటిగా ఉంటుందని తెలిపారు. ప్రభాస్ ఈ చిత్రానికి ఎంత శ్రమ పెట్టారని తెలిపారు.

Also Read: అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్ గా రేవంత్ రెడ్డి..?

సంక్రాంతికి భారీ రిలీజ్ 

2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈసారి సంక్రాంతి సీజన్‌లో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ ఉండనుంది. ఎందుకంటే ప్రభాస్ సినిమా కు పోటీగా తలపతి విజయ్ నటించిన ‘జనా నాయకన్’ అదే రోజు థియేటర్లలోకి రానుంది. మొత్తం మీద… ‘ది రాజా సాబ్’ ప్రభాస్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సినిమా. భారీ స్కేలు, గ్రాండ్ సాంగ్స్, టాప్ కాస్ట్ అన్ని సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేసాయి. చలిలో కూడా ప్రభాస్ పాటలను అద్భుతంగా షూట్ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు.

Advertisment
తాజా కథనాలు