Game Changer: 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. 'పుష్ప2' కన్నా తక్కువ 'దేవర' కంటే ఎక్కువ

'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజే రూ. 186 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లను రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకంటించింది. దీంతో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోయింది.

New Update
game changer NaaNaa Hyraanaa

ram charan sj suryah

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ నటించిన పొలిటికల్ డ్రామా 'గేమ్‌ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న భారీ అంచనాల నడుమ విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మూవీ టీమ్ తాజాగా మొదటి రోజు కలెక్షన్స్‌ వివరాలను అధికారికంగా ప్రకటించింది. 

మిక్స్డ్ టాక్ తోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజే రూ. 186 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లను రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకంటించింది. ఈ ఓపెనింగ్స్ తో 'గేమ్ ఛేంజర్' మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోయింది.

Also Read: Lal Bahadur Shastri లాల్‌ బహుదర్‌ శాస్త్రిని చంపిందేవరు..ఇప్పటికీ వీడని మిస్టరీ!

 డే 1 హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో అల్లు అర్జున్ 'పుష్ప 2' రూ.294 కోట్లతో టాప్ ప్లేస్ లో ఉండగా.. 'RRR' రూ. 223 కోట్లు, 'బాహుబలి 2' రూ. 210 కోట్లు, 'కల్కి 2898AD' రూ. 191 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు 'గేమ్‌ ఛేంజర్' రూ.186 కోట్లతో నాల్గవ స్థానంలో నిలిచింది. తదుపరి స్థానంలో ఎన్టీఆర్ 'దేవర' రూ. 172 కోట్లతో ఉంది. ఎన్టీఆర్ 'దేవర' కంటే 'గేమ్ ఛేంజర్' మూవీకి ఎక్కువ ఓపెనింగ్స్ రావడం విశేషం.

Also Read: PanCard: మీ పాన్‌ కార్డుకి సంబంధించి ఈ మెసేజ్‌ వచ్చిందా అయితే జాగ్రత్త

Advertisment
తాజా కథనాలు