/rtv/media/media_files/2025/10/22/happy-birthday-prabhas-2025-10-22-20-18-38.jpg)
happy birthday prabhas
Prabhas Birthday Special: ఈ రోజు మన తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత అభిమానులు కలిగిన స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. అక్టోబర్ 23, 1979 న మద్రాసు (ప్రస్తుతం చెన్నై)లో జన్మించిన ప్రభాస్.. అక్టోబర్ 23, 2025న(ఈ రోజు) తన 46వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పుట్టిన రోజుని పురస్కరించుకొని ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నారు. “బాహుబలి”(Baahubali) సినిమా తర్వాత ప్రభాస్ పేరు దేశాన్ని దాటి విదేశాల్లో కూడా మారుమోగిపోయింది. కానీ ఈ స్థాయికి రావడం వెనుక ఉన్న కష్టాలు, ఆయన డెడికేషన్ చాలా మందికి తెలియవు. ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ జీవితం, కుటుంబం, సినిమాలు, అభిరుచులు, అరుదైన విషయాల గురించి తెలుసుకుందాం.
ప్రభాస్ అసలు పేరేంటో తెలుసా..? (Prabhas Full Name)
ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. 1979 అక్టోబర్ 23న తమిళనాడు, చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు ప్రముఖ నిర్మాత కాగా, తల్లి పేరు శివ కుమారి. ప్రభాస్‌కి ఒక అన్న ప్రమోద్ ఉప్పలపాటి, ఒక అక్క ప్రగతి ఉన్నారు. ప్రభాస్ తండ్రి ప్రసిద్ధ సినీ నటుడు ఉప్పలపాటి కృష్ణంరాజు గారి సోదరుడు.
Also Read: "మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932".. ప్రభాస్ ప్రీ-లుక్ పోస్టర్ అదిరిపోయింది👌
చిన్నప్పటి నుంచీ ప్రభాస్ సినిమాల్లోకి రావాలని కోరుకోలేదు. ఆయనకు వ్యాపారం మీద ఆసక్తి ఎక్కువ. ఒకప్పుడు ఆయన స్వంత హోటల్ చైన్ ప్రారంభించాలని కూడా అనుకున్నారు. కానీ ఆయన మామయ్య కృష్ణంరాజు గారి ప్రేరణతో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు.
విద్యాభ్యాసం - మొదటి సినిమా.. (Prabhas schooling and First Movie Details)
ప్రభాస్ విద్యాభ్యాసం భీమవరం లోని డి.ఎన్.ఆర్ స్కూల్లో, డాన్ బాస్కో మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్, చెన్నై లో పూర్తయ్యింది. తరువాత శ్రీ చైతన్య కాలేజ్, హైదరాబాద్ నుండి బీటెక్ చేశారు. 2002లో ఈశ్వర్ సినిమా ద్వారా ఆయన సినీ రంగంలో అడుగు పెట్టారు. మొదటి సినిమాతోనే ప్రభాస్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.
Year | Title | Role | Notes |
---|---|---|---|
2002 | Eeswar | Eeswar | Debut Film |
2003 | Raghavendra | Raghava | |
2004 | Varsham | Venkat | |
2004 | Adavi Ramudu | Ramudu | |
2005 | Chakram | Chakram | |
2005 | Chatrapathi | Sivaji / Chatrapathi | |
2006 | Pournami | Sivakeshava Naidu | |
2007 | Yogi | Eeswar Prasad / Yogi | |
2007 | Munna | Mahesh Kumar "Munna" | |
2008 | Bujjigadu | Bujji | |
2009 | Billa | Billa and Ranga | Dual Role |
2009 | Ek Niranjan | Chotu | |
2010 | Darling | Prabhas "Prabha" | |
2011 | Mr. Perfect | Vicky | |
2012 | Rebel | Rishi / Rebel | |
2012 | Denikaina Ready | Himself | Voice-over |
2013 | Mirchi | Jai | |
2014 | Action Jackson | Himself | Hindi Film; Cameo in "Punjabi Mast" |
2015 | Baahubali: The Beginning | Amarendra & Mahendra Baahubali | Bilingual |
2017 | Baahubali 2: The Conclusion | Amarendra & Mahendra Baahubali | |
2019 | Saaho | Siddhanth Saaho / Ashok Chakravarthy | |
2022 | Radhe Shyam | Vikramaditya | |
2023 | Adipurush | Raghava | |
2023 | Salaar: Part 1 – Ceasefire | Devaratha "Deva" Raisaar / Salaar | |
2024 | Kalki 2898 AD | Bhairava and Karna | Dual Role |
2025 | Kannappa | Rudra | Cameo Appearance |
2025 | Mirai | Narrator | Voice-over |
2025 | Baahubali: The Epic | Amarendra & Mahendra Baahubali | Combined Re-release of Baahubali 1 & 2 |
2026 | The RajaSaab | TBA | Post-production |
TBA | Fauji | TBA | Filming |
TBA | Spirit | TBA | Pre-production |
ప్రభాస్ కు గుర్తింపు తెచ్చిన వర్షం, చత్రపతి..
2004లో వచ్చిన వర్షం సినిమా ప్రభాస్ కెరీర్‌ను మలుపు తిప్పింది. వెంకట్ పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన చత్రపతి (దర్శకుడు రాజమౌళి) ఆయనకు బలమైన హీరో ఇమేజ్ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
తరువాత బిల్లా, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, మిర్చి వంటి సినిమాలతో ప్రభాస్ తన అభిమానుల్ని విస్తరించారు. ఆయన నటనలో ఉన్న సహజత్వం, వినయం, డైలాగ్ డెలివరీ ప్రతి సినిమాలో కొత్తగా అనిపిస్తుంది. సినిమా సినిమాకు తన లుక్స్ మారుస్తూ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నారు.
ప్రభాస్ జీవితాన్ని మార్చిన 'బాహుబలి' (Prabhas Baahubali Intresting Facts)
ప్రభాస్ కెరీర్‌లో అత్యంత పెద్ద మైలురాయి బాహుబలి సినిమా. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ నాలుగేళ్లు ఇతర సినిమాలు వదిలి కేవలం ఈ సినిమాకే అంకితమయ్యారు. పాత్ర కోసం కఠినమైన వర్కౌట్లు చేసి, భారీ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ సాధించారు. ఆయన ట్రైనర్ 2010 Mr. వరల్డ్ విజేత లక్ష్మణ్ రెడ్డి.
Also Read: 'ఆపరేషన్ Z' ప్రభాస్ 'ఫౌజీ' అప్‌డేట్ వచ్చేసింది..!
2015లో వచ్చిన బాహుబలి: ది బిగినింగ్ ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టింది. ఆ తర్వాత 2017లో వచ్చిన బాహుబలి 2: ది కన్‌క్లూజన్ భారత సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ఆయనకు ప్రపంచం నలుమూలల నుండి 5000కు పైగా పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని చెబుతారు! తెలుగు సినిమా చరిత్ర అంటే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అన్నంతలా పేరు తెచ్చిపెట్టింది బాహుబలి సినిమా. తెలుగు సినిమాను ప్రపంచ పటం లోకి ఎక్కించి చరిత్ర తిరగ రాసాడు అమరేంద్ర బాహుబలి.
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ వాక్స్ స్టాట్యూ.. (Prabhas wax statue at Madame Tussauds museum)
#Prabhas about his wax statue ❤️ pic.twitter.com/cuoOwqttvs
— YASH💫 (@yashprabhas07) July 14, 2025
ఇక ప్రభాస్ జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలకైతే కొదవే లేదు. "బాహుబలి" సినిమా తర్వాత ప్రభాస్‌కి వచ్చిన ఫేమ్ అంతా ఇంతా కాదు. అంతటి గుర్తింపుతో 2017లో బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మోమును ప్రతిమగా పెట్టారు. దక్షిణాది నటులలో ఈ గౌరవం పొందిన మొదటి నటుడు ప్రభాస్ కావడం విశేషం. అందులో ఆయన బాహుబలి పాత్రలో, యోధుడిలా కవచధారిగా కనిపించడమే ప్రత్యేక ఆకర్షణ.
'Baahubali: The Epic' Re Release
ఇటీవల 'బాహుబలి' సినిమాకు 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దర్శకుడు రాజమౌళి ఈ రెండు భాగాలను (బాహుబలి 1, 2) కలిపి ఒకే సినిమాగా, మరింత అభివృద్ధి చేసిన టెక్నికల్ క్వాలిటీతో, కొన్ని కొత్త సన్నివేశాలతో 'Baahubali: The Epic' పేరుతో మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇది అక్టోబర్ 31, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఐమాక్స్ సహా పెద్ద తెరలపై ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మళ్లీ ఆస్వాదించవచ్చు.
ప్రభాస్ 'పౌర్ణమి' రీ - రిలీజ్..
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు క్లాసిక్ సినిమా ‘పౌర్ణమి’ ఇప్పుడు 4K ఫార్మాట్‌లో రీ-రిలీజ్ కాబోతుంది. ఇది ప్రభాస్ జన్మదినాన్ని(Prabhas Birthday) పురస్కరించుకుని అక్టోబర్ 23, 2025 న విడుదల కానుంది. 2006లో విడుదలైన పౌర్ణమి సినిమాకు అప్పట్లోనే విశేష ఆదరణ లభించింది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, త్రిషా, చార్మి కీలక పాత్రల్లో నటించారు. భక్తి, ప్రేమ, త్యాగం, సంప్రదాయం అనే అంశాలను చక్కగా చూపిస్తూ, ఈ సినిమా ఆధ్యాత్మికతతో పాటు భావోద్వేగాలకూ పెద్దపీట వేసింది.
Also Raed: బాహుబలి ది ఎపిక్ సంచలనం.. అమెరికాలో ప్రీ బుకింగ్స్ రికార్డులు!
ప్రభాస్ ఫిట్‌నెస్ సీక్రెట్.. (Prabhas Fitness Secret)
ప్రభాస్ ఫిట్‌నెస్‌కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆయనకు జిమ్‌లో వర్కౌట్ చేయడం ఇష్టం. ఆయన ఇంట్లోనే ఒక పెద్ద జిమ్ ఉంది, అందులో అధునాతన వ్యాయామ యంత్రాలతో ప్రతిరోజూ వ్యాయామం చేస్తారు. అతని ఫేవరెట్ స్పోర్ట్ వాలీబాల్. షూటింగ్‌ల మధ్యలో కూడా స్నేహితులతో వాలీబాల్ ఆడటం ఆయనకు ఇష్టం.
ప్రభాస్ లగ్జరీ ఇల్లు.. (Prabhas Luxury House)
ప్రభాస్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో ఒక అద్భుతమైన బంగ్లాలో నివసిస్తున్నారు. ఈ ఇల్లు సుమారు రూ.60 కోట్లు విలువైనదని చెబుతారు. ఇంటిలో ఒక ఇండోర్ స్విమ్మింగ్ పూల్, మోడరన్ జిమ్, పెద్ద గార్డెన్ ఉన్నాయి. ఇంటి చుట్టూ పచ్చదనం ఆయనకు ఎంతో ఇష్టం. అలాగే ఆయనకు భీమవరం దగ్గర 84 ఎకరాల ఫార్మ్‌హౌస్ కూడా ఉంది. షూటింగ్స్ లేని సమయాల్లో అక్కడే ప్రభాస్ ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటారు. విదేశాల్లో కూడా ఆయనకు ఇటలీలో ఒక విల్లా ఉంది.
ప్రభాస్ నెట్ వర్త్, రెమ్యునరేషన్.. (Prabhas Net Worth and Remunaration)
ప్రభాస్ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు. ఒక సినిమాలో ఆయన రూ.80 కోట్ల నుండి రూ.150 కోట్ల వరకు తీసుకుంటారని సమాచారం. ఆయన నెట్ వర్త్ సుమారు రూ.241 కోట్లు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా కూడా సంవత్సరానికి 50 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు.
ప్రభాస్ కార్ల కలెక్షన్.. ప్రభాస్‌కి కార్లంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజీలో ఉన్న కొన్ని లగ్జరీ కార్లు ఇవే:
- రేంజ్ రోవర్
- రోల్స్ రాయిస్ ఫాంటమ్
- లాంబోర్గినీ అవెంటడార్ రోడ్‌స్టర్
- జాగ్వార్ XJR
- BMW X3
హిందీ సినిమాల్లో ప్రభాస్ క్యామియో (Prabhas Cameo In Bollywood)
ప్రభాస్ తొలిసారి బాలీవుడ్‌లో ఆక్షన్ జాక్సన్ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. తర్వాత సాహో (2019) ద్వారా ప్రధాన పాత్రలో బాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. ఆ సినిమాలో ఆయనకు శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. సినిమా టాక్ పరంగా మిక్స్డ్ రెస్పాన్స్ పొందినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ₹600 కోట్ల వసూళ్లు సాధించి ప్రభాస్ బాక్సఫీస్ స్టామినా ఏంటో నిరూపించింది.
Also Read: 'నా డార్లింగ్ సో స్వీట్'.. ప్రభాస్ ని పొగిడేస్తున్న ముద్దుగుమ్మ..!
ప్రభాస్ అభిరుచులు, ఇష్టాలు.. (Prabhas Hobbies and Interests)
హాబీలు: వాలీబాల్ ఆడడం, పుస్తకాలు చదవడం.
ఫేవరెట్ ఫుడ్: హైదరాబాద్ బిర్యానీ.
ఇష్టమైన నటులు: రాబర్ట్ డి నీరో, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే.
ఇష్టమైన దర్శకుడు: రాజ్‌కుమార్ హిరానీ. ఆయన సినిమాలు మున్నాభాయి ఎంబీబీఎస్, 3 ఇడియట్స్ ను ఎన్నో సార్లు చూసినట్టు ప్రభాస్ చాలా సందర్భాల్లో తెలిపారు.
ఇష్టమైన పాట: వర్షం సినిమాలో “మెల్లగా కరగని”.
ఇష్టమైన పుస్తకం: అయన్ రాండ్ రచించిన నవల 'ది ఫౌంటెన్‌హెడ్'.
ఫేవరెట్ ట్రావెల్ ప్లేస్: లండన్.
సింపుల్ అండ్ సైలెంట్ స్టార్ ప్రభాస్..
ప్రభాస్ ఎంత పెద్ద స్టార్ అయినా, ఆయన వ్యక్తిత్వం చాలా సింపుల్. షూటింగ్ లేని రోజుల్లో ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండరు. ఇండస్ట్రీలో ఆయన ఇంట్రోవర్ట్ అని అందరూ అంటారు. కానీ “ప్రభాస్ హృదయం బంగారం లాంటిది”. ఎప్పుడూ సహాయం చేయడానికి ముందుంటారు. అనేక సేవా కార్యక్రమాలను ఆయన చాలా సైలెంట్ గా చేస్తుంటారు అని ఆయన మిత్రులు, తోటి నటులు అనేక సందర్భాలలో చెబుతుంటారు.
ముగ్గురు చెల్లెళ్లు అంటే ఎంతో ప్రేమ.. (Prabhas Sisters Details)
Our darling #Prabhas with his sisters and @diljitdosanjh on sets of #KALKI2898AD#KALKI2898ADOnJune27thpic.twitter.com/H2ksaZdlMo
— Prabhas Fans (@Team_Prabhas) June 17, 2024
#Prabhas celebrating RakshaBandhan with his cousin sisters yesterday❤️🥰 pic.twitter.com/wDsuMb952X
— Prabhas International FC (@bestofprabhas) August 20, 2024
ప్రభాస్ చాలా శాంతంగా, సింపుల్‌గా ఉంటారు. ఆయనకు కుటుంబం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఆయన పెదనాన్న కృష్ణంరాజు గారికి ముగ్గురు కుమార్తెలు - ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి. వీళ్లంతా ప్రభాస్‌ను ఎంతో ఇష్టపడతారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఈ కుటుంబంలో ప్రసీద మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఫ్యామిలీ ఫొటోలు, వ్యక్తిగత మెమెంట్స్‌ను అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. అదికాకుండా, వారి నిర్మాణ సంస్థ బాధ్యతలు చూసేది కూడా ఆమెనే. మిగతా ఇద్దరు సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు.
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు..? (Prabhas Marriage)
ఇక అభిమానులు ఎప్పుడూ తెలుసుకోవాలనుకునే విషయం ప్రభాస్ పెళ్లి ఎప్పుడనేది. దీనిపై దర్శకుడు రాజమౌళి సరదాగా చెప్పిన మాటలు గుర్తుంచుకుంటే - “ప్రభాస్ చాలా స్లో & లేజీ. పెళ్లి చేసుకోవడం కూడా అతనికి బద్ధకమే” అని హాస్యంగా చెప్పారు. ప్రభాస్ కూడా దానికి సమాధానంగా, “అవును, నేను అందరితో కలిసిపోయే వ్యక్తిని కాను, అంతగా బయటికి వెళ్లే మనిషిని కాదు” అని తెలిపారు. బాహుబలి తర్వాత 6000కు పైగా పెళ్లి ఆఫర్లు వచ్చినా, ఆయన ఇంకా సింగిల్‌గానే ఉన్నారు.
ప్రభాస్ రాబోయే సినిమాలు.. (Prabhas Upcoming Movies List)
ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో చాలా భారీ ప్రాజెక్టులు ఉన్నాయి:
1. ది రాజా సాబ్ (The Raja Saab) - మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది.
2. కల్కి 2(Kalki 2): కల్కి 2' సినిమా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు, ప్రస్తుతం దీని చిత్రీకరణ డిసెంబర్ 2025లో ప్రారంభం అవుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. ఈ సినిమా 'కల్కి 2898 AD' కి సీక్వెల్.
3. సలార్ 2: శౌర్యాంగ పర్వం(Salaar 2) - “సలార్ పార్ట్ 1: సీజ్‌ఫైర్” తర్వాతి భాగం. ఇందులో ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్‌తో మరోసారి తెరపై కనిపించనున్నారు.
4. స్పిరిట్ (Spirit) - సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుంది.
5. ఫౌజీ (Fauji) - హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడిక్ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో ప్రత్యేక ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ప్రభాస్ బర్త్డే సందర్భంగా అక్టోబర్ 23 ఉదయం 11:07 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ అండ్ పోస్టర్ అప్ డేట్ రానుంది.
----------------------------------
— Hanu Raghavapudi (@hanurpudi) October 22, 2025
पाण्डवपक्षे संस्थित कर्णः।
----------------------------------#PrabhasHanu TITLE POSTER - Tomorrow @ 11.07 AM ❤🔥
Rebel Star #Prabhas#Imanvi#MithunChakraborty#JayaPrada@AnupamPKher@Composer_Vishal@sudeepdop@kk_lyricist… pic.twitter.com/I4r2YtXLtA
“బాహుబలి” సినిమాతో భారత సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రభాస్, నిజమైన పాన్ ఇండియా స్టార్. ఆయన పేరు వచ్చినప్పుడల్లా తెలుగు ప్రజలకు గర్వంగా ఉంటుంది. సక్సెస్, ఫెయిల్యూర్ రెండింటినీ ఒకే మనసుతో అంగీకరించే ఈ సైలెంట్ స్టార్, నేటి యువతరానికి ఎంతో ప్రేరణ.
ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు! (Happy Birthday Prabhas)
ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఆయన అభిమానులు బ్లడ్ డొనేషన్, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభాస్ వంటి సింపుల్ స్టార్‌లు చాలా అరుదు. ఆయన చిరునవ్వు, వినయం, కష్టపడి పనిచేసే స్వభావం తెలుగు సినిమాకి గర్వకారణం.