/rtv/media/media_files/2025/10/22/prabhas-hanu-2025-10-22-12-22-39.jpg)
prabhas- hanu
Prabhas-Hanu: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఫౌజీ ' ఒకటి! హను రాఘవపూడి- ప్రభాస్ కాంబోలో 'ఫౌజీ ' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా దీనికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రేపు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టైటిల్ రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రీ- లుక్ పోస్టర్ ను విడుదల చేయగా.. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. పోస్టర్ లో ప్రభాస్ నడుము కింద భాగం మాత్రమే కనిపిస్తోంది. పొడవైన ఓవర్ కోట్, బూట్లు ధరించి.. చేతిలో బ్యాగ్ పట్టుకొని ఆసక్తికరంగా కనిపించింది ప్రభాస్ పోస్టర్. ప్రభాస్ ఫొటో వెనుక ఉన్న ఓ గోడపై తుపాకులు పట్టుకొని ఉన్న సైనికుల షాడో కనిపిస్తోంది. పోస్టర్ పై "Most Wanted Since 1932'' అనే క్యాప్షన్ సినిమా ప్రీ- ఇండిపెండెన్స్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది.
----------------------------------
— Mythri Movie Makers (@MythriOfficial) October 22, 2025
पाण्डवपक्षे संस्थित कर्णः।
----------------------------------#PrabhasHanu TITLE POSTER - Tomorrow @ 11.07 AM ❤🔥
Rebel Star #Prabhas#Imanvi@hanurpudi#MithunChakraborty#JayaPrada@AnupamPKher@Composer_Vishal@sudeepdop@kk_lyricist… pic.twitter.com/jf8hYx9usU
Follow Us