/rtv/media/media_files/2025/10/15/riddhi-kumar-2025-10-15-13-52-30.jpg)
Riddhi Kumar
Riddhi Kumar: ఇటీవల ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నటి రిధి కుమార్ ప్రభాస్‌తో(Prabhas) కలిసి చేస్తున్న తాజా చిత్రం "ది రాజా సాబ్"(The Raja Saab) గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇప్పటికే వీరిద్దరూ "రాధే శ్యామ్" సినిమాలో కలిసి పనిచేశారు, అయితే ఈసారి మాత్రం ఆమె ప్రభాస్‌కు హీరోయిన్‌గా జతకడుతున్నారు.
Also Read:రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!
ప్రభాస్‌తో పనిచేయడం ఓ ప్రత్యేక అనుభవం: రిద్ధి కుమార్
రిద్ధి కుమార్ మాట్లాడుతూ, "ది రాజా సాబ్ అనేది నాకు చాలా స్పెషల్ ప్రాజెక్ట్. ఈ సినిమా అనుభవం నిజంగా అద్భుతంగా ఉంది. షూటింగ్ సెట్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. టైటిల్‌కు తగిన విధంగా సెటప్‌ను ఏర్పాటు చేశారు" అని చెప్పారు.
ఈ సినిమా వల్ల ప్రభాస్‌తో ఆమెకు రెండో సారి కలిసి పని చేసే అవకాశం వచ్చిందని. మొదటిసారి "రాధే శ్యామ్"లో అతిథి పాత్రలో కనిపించిన రిద్ధి కుమార్, ఈసారి ప్రభాస్‌కు లీడ్ రోల్‌లో జతకావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఆమె మాట్లాడుతూ
Also Read: ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!
"ప్రభాస్ గారు నిజంగా చాలా మంచి వ్యక్తి. ఆయనతో పనిచేయడం ఎంతో ఈజీగా ఉంటుంది. ఆయన చాలా స్వీట్, అర్థం చేసుకునే వ్యక్తి. అవసరమైన చోట సహాయం చేస్తారు, అలాగే ఎంతో కష్టపడతారు." అని తన అనుభవాన్ని చెప్పింది.
గ్రీస్‌లో పాట షూటింగ్
ప్రస్తుతం రిద్ధి కుమార్ గ్రీస్‌లో ఒక పాట కోసం షూటింగ్‌లో ఉన్నారు. అక్కడి అనుభవం గురించి చెబుతూ "ఈ పాట విజువల్స్ ఎలా వస్తాయో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. జనవరి 9న సినిమా థియేటర్లలో విడుదలవుతుంది. మీ అందరూ చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా" అని చెప్పారు.
Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..
"ది రాజా సాబ్"పై భారీ అంచనాలు
ఈ చిత్రానికి మరుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక రోమాంటిక్ హర్రర్ కామెడీగా రూపొందుతోంది. ప్రభాస్ మరోసారి తన మాస్ అండ్ ఫన్ అవతారాన్ని చూపించనున్న ఈ సినిమా మీద ఇప్పటికే అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.