Baahubali Pre Bookings: బాహుబలి ది ఎపిక్ సంచలనం.. అమెరికాలో ప్రీ బుకింగ్స్ రికార్డులు!

బాహుబలి రీ-ఎడిట్ వెర్షన్ అక్టోబర్ 31న విడుదల కానుంది. 3.45 గంటల నిడివితో మళ్లీ వెండి తెరపై సందడి చేయనుంది. అమెరికాలో ప్రీమియర్ షోలకు ఇప్పటికే $100K బుకింగ్స్ దాటింది. IMAX, 4DXలో విడుదల అవుతూ, మరోసారి బాక్సాఫీస్ రికార్డులు తెరగరాస్తోంది.

New Update
Baahubali Pre Bookings

Baahubali Pre Bookings

Baahubali Pre Bookings: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన అద్భుత ప్రపంచం ‘బాహుబలి’ మరోసారి తెరపైకి రాబోతుంది. ప్రభాస్(Prabhas), రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఎపిక్ సిరీస్‌ను రాజమౌళి స్వయంగా రీ-ఎడిట్ చేసి, రెండు భాగాలను కలిపి 3 గంటల 45 నిమిషాల కొత్త వెర్షన్‌గా తయారు చేశారు. ఈ కొత్త ఎడిషన్‌కు “బాహుబలి: ది ఎపిక్” అనే టైటిల్ పెట్టారు.

Also Read: 'నా డార్లింగ్ సో స్వీట్'.. ప్రభాస్ ని పొగిడేస్తున్న ముద్దుగుమ్మ..!

అక్టోబర్ 31న థియేటర్లలోకి

ఈ సినిమా అక్టోబర్ 31, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మరోవైపు, అక్టోబర్ 29న అమెరికాలో ప్రీమియర్ షోలు జరగనున్నాయి. ఇప్పటికే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమవగా, కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా $100,000 డాలర్లకు పైగా ప్రీమియర్ షో కలెక్షన్లు సాధించింది. మొదట ఇది $60,000గా ఉండగా, ఇప్పుడు రెట్టింపు అయ్యింది.

Also Read: రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!

IMAX, 4DX, Dolby ఫార్మాట్స్‌లో

ఈసారి బాహుబలి మరింత గొప్ప అనుభూతిని అందించేందుకు, IMAX, 4DX, Dolby Cinema, DBox, ICE, PCX లాంటి టెక్నాలజీ ఫార్మాట్లలో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ రేంజ్‌లో పాన్ ఇండియా రిలీజ్ చాలా అరుదు.

Also Read: రీ-రిలీజ్ కి ప్రీమియర్ షోస్ ఏంట్రా..? "బాహుబలి: ది ఎపిక్" పెద్ద ప్లానే ..!

మళ్లీ తెరపై మహిష్మతి సామ్రాజ్యం

బాహుబలి, భల్లాలదేవ, కట్టప్ప, దేవసేన పాత్రలు మళ్లీ పెద్ద తెరపై కనిపించబోతున్నాయి. గ్రాఫిక్స్, విజువల్స్, భావోద్వేగాలు, యాక్షన్-ప్రతి అంశం ప్రేక్షకులను మళ్లీ ఆ మాయలోకి తీసుకెళ్లనుంది.

గతంలో ఈ సినిమా సృష్టించిన సంచలనం ఇప్పటికీ మర్చిపోలేనిది. ఇప్పుడు రీ-కట్ వెర్షన్ కూడా అదే స్థాయిలో హైప్ తెచ్చుకోవడంతో, ఈసారి కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించటం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

Advertisment
తాజా కథనాలు