/rtv/media/media_files/2025/03/18/ZjfAySFDK5skrdryIg68.jpg)
Tamannaah Odela 2
చాలా మంది హీరోయిన్లు కెరీర్ స్పాన్ తగ్గేలోపే చేతికి అందినన్ని సినిమాలు చేసి సెటిల్ అవ్వాలనే ఆలోచిస్తారు.. కానీ 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న తమన్నా ఆలోచనలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటాయి. ఇప్పటికే ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు మరోసారి 'ఓదెల-2' అనే సినిమా ద్వారా ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ చిత్రంలో తమన్నా పోషించిన శివశక్తి పాత్ర తాను చేసిన పాత్రల్లో ప్రత్యేకమైనదిగా మిగలుతుందని చాలా బలంగా నమ్ముతున్నారు తమన్నా, ఇది తన కెరీర్‌కి మైలురాయిగా నిలవబోతుందన్న ఆశతో ఉన్నారు. హీరోయిన్ అనుష్కకు ‘అరుంధతి’ ఎంత పెద్ద బ్రేక్ ఇచ్చిందో, తనకూ ఈ సినిమా అదే స్థాయిలో గుర్తింపు తెచ్చే పెడుతుందని భావిస్తున్నారు.
Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..
పవర్‌ఫుల్ ఎలివేషన్స్
ఇక ఈ సినిమాలో దర్శకుడు కాకపోయినా, సంపత్ నంది నిర్మాణం నుంచి దర్శకత్వ సమర్పణ వరకు అన్నీ చూసుకుంటూ తమన్నా పాత్రపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు తమన్నా చేయని షేడ్స్ ఇందులో చూపబోతున్నారని, ఆమెకు స్టార్ హీరోలా పవర్‌ఫుల్ ఎలివేషన్స్ ఉండబోతున్నాయని ఆయన వెల్లడించారు.
Also Read: ‘కేజీఎఫ్ చాప్టర్-2’: రాఖీ భాయ్ విధ్వంసానికి మూడేళ్లు!
17 ఏప్రిల్ 2025న థియేటర్లలోకి రానున్న ‘ఓదెల-2’, తమన్నా ఆశల్ని ఎంతవరకు నెరవేరుస్తుందో చూడాలి. అయితే ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రకారం చుస్తే, తమన్నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Hero Sharwanand | ODELA 2 | Trailer Launch Event | ViP Filmy Hub https://t.co/iXpFfgTaL0 via @YouTube@ImSharwanand
— Vijaya Preetham (@rvkp_92) April 15, 2025
Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని
telugu-news | latest-telugu-news | today-news-in-telugu | telugu-film-news | telugu-cinema-news | tollywood-news-in-telugu | actress-tamannah-bhatia