Movies:ధనుష్ తర్వాత చంద్రముఖి మేకర్స్..నయనతారకు మరోసారి లీగల్ నోటీసులు

ఏ ముహూర్తాన నయనతార నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీకి ఒప్పుకుందో కానీ అది విడుదల అయిన దగ్గర నుంచీ ఆమెకు నోటీసులు మీద నోటీసులు వచ్చి పడుతున్నాయి. ధనుష్ తర్వాత తాజాగా చంద్రముఖి మేకర్స్ నయనతారకు 5కోట్లు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపారు. 

author-image
By Manogna alamuru
New Update
dacumentary

Nayanthara

 2003లో మలయాళ సినిమా మనసునక్కరేతో మూవీస్‌లోకి అడుగుపెట్టింది నయనతార. ఆ తర్వాత చాలా తక్కువ కాలంలోనే పెద్ద హీరోయిన్‌గా, లేడీ సూపర్‌‌టార్‌‌గా ఎదిగింది. దాదాపు అందరు పెద్ద హీరోలతో హీరోయిన్‌గా చేయడమే కాకుండా హీరోయిన ఓరియెంటెడ్ సినిమాలతో ఇమేజ్‌ను పెంచుకుంది. ఈ క్రమంలోనే రెండు లవ్ ఫెల్యూర్స్ తరువాత తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ను పెళ్ళి చేసుకుంది. వీరిద్దరికీ ఇద్దరు ట్విన్స్ కూడా ఉన్నారు ఇప్పుడు. 

Also Read: USA: అమెరికాలో కెనడా విలీనం..అందుకే ట్రుడో రాజీనామా అంటున్న ట్రంప్

అయితే రీసెట్‌గా అంటే దాదాపు రెండు నెలల క్రితం నెట్ ఫ్లిక్స్‌లో నయనతార (Nayanthara) సినిమాలు, పెళ్ళి అన్నీ కిపి ఓ డాక్యుఎంటరీగా రూపొందించి రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. అక్కడి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఇందులో  నయనతార  మొదటి సినిమా నుంచి తన భర్తతో కలిసి చేసిన సినిమాలు, షారూఖ్ తో నటించిన జవాన్ సినిమా వరకూ అన్నింటిలో నుంచి క్లిప్స్ వాఉకున్నారు. ఇప్పుడు ఇవే ఆమెకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇంతకు ముందు డాక్యుమెంటరీ రిలీజ్ అయిన వెంటనే హీర ధనుష్ ననతారకు లీగల్ నోటీసులు పంపించారు. ఆయన ప్రొడ్యూస్ చేసిన నానుమ్ రౌడీ ధాన్ సినిమాలో క్లిప్స్ తమ అనుమతి లేకుండా ఉపయగించుకున్నారని ఆరోపించారు. దానిపై నయనతార మండిపడుతూ 3 పేజీల లేఖు రిఈజ్ చేసింది. దాంతో అది కాస్తా పెద్ద గొడవగా మారింది. దీని తరువాత నయనతార తనకు మద్దతునిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ...వారి సినిమాల నుండి క్లిప్‌లను ఉపయోగించడానికి NOCల లిస్ట్‌ను ప్రకటించింది. ఇందులో నిర్మాత రామ్‌కుమార్, చిరంజీవి, షారూఖ్ లాంటి వారందరూ ఉన్నారు. 

Also Read :  అమెరికాలో కెనడా విలీనం..అందుకే ట్రుడో రాజీనామా అంటున్న ట్రంప్

ఇప్పుడు చంద్రముఖి టీమ్...

ప్రస్తుతం రెండు నెలల తర్వాత చంద్రముఖి మేకర్స్ నయనతారకు లీగల్ నోటీసులు పంపించారు. రజనీకాంత్ చంద్రముఖి (Chandramuki) లో నయనతార కూడ ఒక హీరోయిన్. దీనికి సంబంధించి తన డాక్యుమెంటరీలో కొన్ని సెకన్ల క్లిప్‌ను వాడుకున్నారు. దీనికి చంద్రముఖి మేకర్స్ నుంచి ఆమె కానీ, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు కానీ అనుమతి తీసుకోలేదు. అందుకే ఇప్పుడు ఆ మూవీ మేకర్స్ తమ క్లిప్ ఉపయోగించుకున్నందుకు 5 కోట్లు డిమాండ్ చేస్తే నయనతారకు లీగల్ నోటీసులు పంపించారు. దీనికి నయనతార ఇంకా స్పందించలేదు. 

Also Read: Earthquake: చైనా, టిబెట్ భూకంపాలు...36 మంది మృతి

Also Read :  ఇన్ని గొడవలతో ఇక పోరాడలేను–ట్రూడో

Advertisment
Advertisment