కెనడా దేశం ఎక్కువగా అమెరికా మీద ఆధారపడుతుంది. అత్యధికంగా యూఎస్ నుంచి రాయితీలు పొందుతుంది. అదే కెనడా అమెరికాలో కలిసి పోతే అటు అమెరికాకు, ఇటు కెనడాకు రెండింటకీ చాలా మంచిది. యూఎస్ ఎక్కువ నష్టపోనక్కర్లేదు. సుంకాలు ఉండవు, పన్నులు తగ్గుతాయి...ఇదీ ట్రంప్ ఎప్పటి నుంచో చెబుతున్న మాటలు. ఆను పదవిలోకి వచ్చాక కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకాలు విధిస్తానని కూడా ప్రకటించారు. వలసలు, డ్రగ్స్ అక్రమరవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేనిపక్షంలో సుంకాలు పెంచుతానని కూడా హెచ్చరించారు. ఇందులో విఫలం అయితే కెనడాను అమెరికాలో కలిపేసుకుంటామని కూడా డైరెక్ట్‌గా ట్రుడోకే చెప్పారు ట్రంప్. Also Read: Chhattisgarh: జర్నలిస్ట్ ముకేశ్ హత్య కేసులో వెలుగులోకి భయానక విషయాలు.. ఆ విషయం ట్రుడోకు తెలుసు... ఇప్పుడు కెనడా ప్రధాని రాజీనామా సందర్భంగా ట్రంప్ మరోసారి ఆ విషయాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. కెనడాను అమెరికా 51వ రాష్ట్రగా చేరాలని తిరిగి తాను ప్రతిపాదిస్తున్నాని అన్నారు. అమెరికాలో ఉండడం చాలామంది కెనడియన్లకు కూడా ఇష్టమేనని...అది తెలిసే ట్రుడో రాజీనామా చేశారని ట్రప్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కెనడా తమ దేశంలో కలిసి పోతే రాయితీల పేరున అమెరికా ఎక్కువ నష్టపోనక్కర్లేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు రష్యా, చైనాల తాలూకా షిప్‌ల నుంచి ఎలాంటి ఆపద కూడా ఉండదు అంటూ తన పోస్ట్‌లో రాశారు. మరోవైపు సొంత పార్టీలోనే తన మీద వ్యతిరేకత ఉన్నప్పుడు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం సరైనది అవదని ట్రూడో అన్నారు. తాను ఎప్పుడూ కెనడాలోని ప్రజల కోసమే పోరాడనని చెప్పారు. 2015లో కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అంతర్గత పోరు కారణంగా నిన్న తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు తన సొంత పార్టీ లిబరల్ నాయకత్వాన్ని కూడా వదులుకున్నారు. Also Read: Allu Arjun: ఈరోజు శ్రీ తేజ్‌ను పరామర్శించనున్న అల్లు అర్జున్