వచ్చేసిన అక్క టీజర్.. బోల్డ్ లుక్‌లో కీర్తీ సురేశ్..

ధర్మరాజ్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న అక్క టీజర్‌ను ఓటీటీ దిగ్గజం నెట్​ఫ్లిక్స్‌ విడుదల చేసింది. కీర్తి సురేశ్, రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎలాంటి మాటలు లేకుండా విడుదల చేసిన టీజర్, కీర్తీ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటోంది.

New Update
AKka Teaser

AKka Teaser Photograph: (AKka Teaser)

కీర్తి సురేశ్ (Keerthy Suresh), రాధిక ఆప్టే (Radhika Apte) ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న థ్రిల్లర్ సిరీస్ 'అక్క' టీజర్ వచ్చేసింది. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని లుక్‌లో కీర్తీ సురేష్ అందరినీ ఆకట్టుకుంది. బోల్డ్‌గా వాక్ చేస్తూ.. సీరియస్‌ లుక్‌లో అందరినీ వావ్ అనిపించేలా చేసింది. ఈ సిరీస్ ఓటీటీ దిగ్గజం నెట్​ఫ్లిక్స్ టీజర్‌ను విడుదల చేసింది. యష్ రాజ్ ఫిల్మ్ ఎంటర్‌టైన్‌మెంట్​ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇది కూడా చూడండి: Trump: మెక్సికో, కెనడాకు బంపరాఫర్‌ ఇచ్చిన ట్రంప్‌ ..నెల రోజుల పాటు ఇక ఆ కష్టాలు ఉండవు!

ఇది కూడా చూడండి: Non-Vegetarias : మాంసం మస్తు తింటున్రు...మనది ఎన్నోస్థానమంటే....

బోల్డ్ లుక్‌లో వావ్ అనిపించిన కీర్తీ సురేష్..

పేర్నూరుకు చెందిన ఓ అమ్మాయి పతనంపై రివేంజ్ ఎలా తీర్చుకున్నారనే అనే దానిపై సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఒక్క డైలాగ్ లేకుండా గన్స్, గోల్డ్, మర్డర్, రక్తపాతం వంటివి చూపిస్తూ టీజర్‌ను విడుదల చేశారు. కీర్తి సురేశ్, రాధిక ఆప్టే స్టన్నింగ్స్ లుక్స్ ఇంకా సిరీస్‌పై అంచనాలను పెంచేస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా బోల్డ్ లుక్‌లో ఇద్దరూ కనిపిస్తున్నారు. త్వరలోనే నెట్​ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ రానుంది. 

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..మీదేనా మరి చూసుకోండి!

ఇది కూడా చూడండి: America: అక్రమ వలసదారులతో భారత్‌ కు పయనమైన అమెరికా విమానం!

Advertisment
తాజా కథనాలు