Kayadu Lohar: 'డ్రాగన్' సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది అస్సాం బ్యూటీ కాయదు లోహర్. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా విజయంతో సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. దీంతో అటు తమిళ్, ఇటు తెలుగులో వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది కాయదు. ప్రస్తుతం తెలుగులో విశ్వక్ సేన్ సరసన 'ఫంకీ' సినిమా చేస్తున్న ఈ బ్యూటీ.. మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
వేశ్యగా కాయదు
శ్రీకాంత్ ఓదెల- నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా 'పారడైస్' లో కాయదు నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో నానికి జోడీగా వేశ్య పాత్రలో కనిపించబోతుందని టాక్. సాధారణంగా హీరోయిన్లు వేశ్య పాత్రలు చేయడానికి వెనకడుగు వేస్తారు. కానీ, పాత్ర బలంగా ఉండడంతో కాయదు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే సినిమాలో ఈ పాత్ర ప్రభావం బలంగా ఉంటే కాయదు కెరీర్ కి కీలకంగా మారుతుందని నెటిజన్లు అనుకుంటున్నారు.ఇది మాత్రమే కాదు నాని- కాయదు మధ్య బోల్డ్ సీన్స్ కాస్త ఎక్కువగానే ఉన్నట్లు టాక్.
Also Read : Katrina Kaif: బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ - కత్రినా బర్త్ డే స్పెషల్ ఫొటోలు !
/filters:format(webp)/rtv/media/media_files/2025/05/20/P7588R2kAtQUhqrwdgNu.jpg)
Also Read : ఫోటో కోసం పోజులియ్యబోయిననేత.. కాలు జారడంతో...
ఇదిలా ఉంటే ఇటీవలే నాని 'పారడైజ్' సెకండ్ షెడ్యూల్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ షెడ్యూల్ లో నానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 'దసరా' తర్వాత నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న ఈమూవీపై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాదు ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్ వీడియోలో మాస్ అండ్ రగ్గడ్ అవతార్ లో నాని లుక్ విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది.
Also Read: Naa Koduka song: బిచ్చగాడిలా ఏడ్పించేసిన ధనుష్.. 'నా కొడుకా' ఫుల్ వీడియో సాంగ్!
nani paradise | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news