Naa Koduka song: 'కుబేరా' నుంచి 'నా కొడుకా' ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. కొడుకు కోసం తల్లి పాడే ఈ భావోద్వేగ గీతం సంగీత ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ఇందులో 'బిచ్చగాడి'గా ధనుష్ నటన, హావభావాలు చూసేవారి హృదయాలు హత్తుకునేలా ఉన్నాయి. తల్లి చనిపోయిన తర్వాత అనాథలా మారిన హీరో జీవితంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కున్నాడు అనేది ఈ పాటలో చూపించారు. టాక్ స్టార్ దేవి మ్యూజిక్ ఈ భావోద్వేగ గీతాన్ని మరింత హైలైట్ చేసింది. నంద కిషోర్ సాహిత్యం అందించగా.. సింధూరి విశాల్ ఆలపించారు. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read:Naga Babu Re Entry: 12 ఏళ్ల తర్వాత నాగబాబు గ్రాండ్ రీ ఎంట్రీ.. 'జబర్దస్త్' ప్రోమో చూశారా
Straight from the soul — #NaaKoduka lyric video from #Kuberaa is emotion amplified.🎧💔
— Aditya Music (@adityamusic) June 20, 2025
𝗧𝗿𝗲𝗻𝗱𝗶𝗻𝗴 #1 on #YouTubeMusic ▶️ https://t.co/TGIBexknvp
A Rockstar @ThisIsDSP musical 🎶#Kuberaa in cinemas now!#Kuberaa4thSingle#SekharKammulasKuberaa#Kuberaa#KuberaaBookings… pic.twitter.com/mX8Vd7FioT
ఇది కూడా చూడండి:TG News: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!
రూ. వంద కోట్ల వసూళ్లు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రలో గత నెల విడుదలైన 'కుబేరా' బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇతర భాషల్లో యావరేజ్ గా ఆడినా.. తెలుగులో మాత్రం సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ కొనసాగించింది. వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. వంద కోట్ల వసూళ్లు సాధించి ధనుష్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వీధుల్లో నివసించే బిచ్చగాడు, బిలీనియర్ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'లవ్ స్టోరీ' తర్వాత 'కుబేరా' తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల.
సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ తర్వాత ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. జులై 18 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంటుంది.
ఇది కూడా చూడండి:TG Murder: అక్రమ సంబంధం వల్లే హత్య.. చందు నాయక్ హత్య కేసులో సంచలన విషయాలు!
Kuberaa movie