Air India Flight Crash : నేను ఎలా బతికి బయటపడ్డానంటే? ప్రమాదంలో బయట పడ్డ ఒకే ఒక్కడు రమేష్ సంచలన విషయాలు..

ఆహ్మదాబాద్‌లో ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదకరమైన సంఘటనలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. విశ్వాష్ కుమార్ రమేష్ అనే బ్రిటిష్ పౌరుడు ప్రాణాలతో మృత్యుంజయుడిగా నిలిచాడు.

New Update
Ramesh Viswashkumar

Ramesh Viswashkumar

Air India Flight Crash : ఆహ్మదాబాద్‌ విమానాశ్రయం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ మెడికల్‌ కాలేజీ హస్టల్‌ పై కూలిపోయింది. ఈ సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు పేర్కొంటున్నారు. అందులో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాణి కూడా ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో దాదాపు అందరూ చనిపోయారని అధికారులు భావిస్తున్న సమయంలో ఒక అద్భుతం వెలుగులోకి వచ్చింది.  

ఈ విషాదకరమైన సంఘటనలో అందరూ అనుకున్నట్లు ప్రయాణీకులంతా మరణించలేదని తెలుస్తోంది . ఈ ప్రమాదంలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. విమానంలో 11ఏ సీటులో కూర్చున్న 40 ఏళ్ల విశ్వాష్ కుమార్ రమేష్ అనే బ్రిటిష్ పౌరుడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన ఘటనా స్థలం నుంచి నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు ఇపుడు వైరల్‌గా మారాయి.

విశ్వాష్ కుమార్ రమేష్  అహ్మదాబాద్‌లోని సివిల్ హాస్పిటల్, అసరవాలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఈ ఘోర ప్రమాదం నుండి బయటపడ్డానని చెప్పాడు. విశ్వాష్ తన ఛాతీ, కళ్ళు,పాదాలకు గాయాలయ్యాయని భయంకరమైన క్షణాలను గుర్తు చేసుకున్నారు. "టేకాఫ్ అయిన ముప్పై సెకన్ల తర్వాత, పెద్ద శబ్దం వచ్చింది, ఆపై విమానం కూలిపోయింది.  కూలిపోతున్న సమయంలోనే బయటకు దూకేశానన్నారు. ఇదంతా చాలా వేగంగా జరిగింది" అని అతను చెప్పుకొచ్చాడు. మృతదేహాలు, శిథిలాల మధ్య లేచి, సహాయం కోసం పరుగెత్తి అంబులెన్స్‌లోకి చేరుకున్నానని అతను వివరించాడు. విశ్వాష్ తన సోదరుడు, 45 ఏళ్ల అజయ్ కుమార్ రమేష్‌తో కలిసి ప్రయాణిస్తున్నట్లు తెలిపాడు. కాగా తన సోదరుడు వేరే వరుసలో కూర్చున్నాడని వివరించాడు. తన సోదరుడి ఆచూకీ కోసం అతను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కాగా ఈ ప్రమాదంలో ఒకే ఒక్కడు బతకడంతో మృత్యుంజయుడు అంటూ ఆయనను గురించి ప్రస్తావిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు