/rtv/media/media_files/2025/06/12/WmYnEquUh911iVFIS5yk.jpg)
annadata sukhibhava
టాలీవుడ్ సినీ నటి కల్పికా గణేష్‌పై కేసు నమోదైంది. గత నెల 29న ప్రిజం పబ్‌లో తమ సిబ్బంది పట్ల అసభ్య ప్రవర్తన చేసిందని కల్పికపై పబ్ యజమాన్యం గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. 324(4),352,351(2) బిఎన్ఎస్ ఆక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేశారు.
Also Read: సోనమ్ మామూల్ది కాదయ్యా ..భర్తను చంపి ఫేస్బుక్లో పోస్టు.. హనీమూన్ కేసులో బిగ్ ట్విస్ట్!
నటి కల్పిక ఇటీవల తన బర్త్ డే సందర్భంగా ప్రిజం పబ్‌కు వెళ్లింది. అక్కడ అర్థరాత్రి వరకు ఉండి బర్త్ డే వేడుకలను ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. అనంతరం పబ్ ముగింపు సమయంలో డిజర్ట్ విషయంలో ఆమె అభ్యంతరం తెలిపింది. దీంతో కల్పికకు, పబ్ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. అదే సమయంలో కల్పిక తన ఇన్‌స్టాలో లైవ్ పెట్టింది. పబ్ నిర్వాహకులు తనపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నంటూ లైవ్ వీడియోలో పేర్కొంది.
Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !
అనంతరం ప్రిజం పబ్ నిర్వాహకులపై గచ్చిబౌలి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ గొడవను చూస్తూ ఉండిపోయారు. దీంతో పోలీసుల తీరు చూసిన ఆమె మరింత రెచ్చిపోయింది. అనంతరం పోలీసులపై కూడా కొన్ని అసభ్యకర మాటలు విసిరింది. దీంతో ఈ గొడవ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై పోలీస్ కేసు నమోదైంది.
Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్‌పై కీలక నిర్ణయం!
kalpika ganesh prism | kalpika ganesh issue | latest-telugu-news | today-news-in-telugu | telugu-film-news | telugu-cinema-news