/rtv/media/media_files/2025/06/11/hdefmNvUmSB5kbsK4EX1.jpg)
France will ban social media for those under 15 within months, says president Macron
ప్రస్తుత రోజుల్లో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఫ్రాన్స్ ప్రభుత్వం.. సోషల్ మీడియా ప్రభావాన్ని పిల్లల్లో తగ్గించడం కోసం చర్యలకు దిగుతోంది. త్వరలో 15 ఏళ్ల లోపు చిన్నారులకు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించేలా నిర్ణయం తీసుకోనున్నామని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తెలిపారు. యూరోపియన్ యూనియన్ ఈ అంశంపై చర్యలు తీసుకోలేకపోతే రాబోయే కొద్ది నెలల్లో తామే పిల్లలపై సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేస్తామని స్పష్టం చేశారు.
Also Read: స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక AXIOM-4 ప్రయెగం మళ్లీ వాయిదా
ఇటీవల తూర్పు ఫ్రాన్స్‌లోని ఓ స్కూల్‌లో 14 ఏళ్ల విద్యార్థి తన బ్యాగ్ తనిఖీ చేస్తున్న సిబ్బందిని కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన ఫ్రాన్స్ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా పిల్లల్లో సోషల్ మీడియా వినియోగంపై ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. '' 15 ఏళ్ల లోపున్న పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలి. యూరోపియన్ యూనియన్ (EU) దీనిపై ఈ చర్యలు తీసుకోకపోతే కొన్ని నెలల తర్వాత తామే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తాం.
Also Read: ఈ నెలలోనే అమెరికా, భారత్ మధ్యంతర డీల్..500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం
ప్రస్తుతం యువతలో హింసాత్మక ధోరణి పెరుగుతోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఎలాంటి పర్యవేక్షణ లేకుండా పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ ఉండటం వల్లే ఇలాంటి సంస్కృతి పెరుగుతోందని'' ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ అన్నారు. మరోవైపు కత్తితో దాడి చేసిన ఆ బాలుడు ఆన్‌లైన్ కంటెంట్ ద్వారా ప్రభావితమయ్యాడా ? లేదా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ యువతలో దూకుడు స్వభావం పెరగడానికి సోషల్ మీడియా వినియోగం కూడా ఓ కారణమని మెక్రాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఒకవేళ మెక్రాన్ నిర్ణయాన్ని ఫ్రాన్స్ అమలు చేస్తే.. సోషల్ మీడియాపై కఠిన చర్యలు తీసుకున్న రెండో దేశంగా ఫ్రాన్స్ నిలుస్తుంది.