/rtv/media/media_files/2025/10/17/kacha-badam-singer-bhuban-badyakar-life-changed-after-getting-viral-2025-10-17-10-11-32.jpg)
Kacha Badam singer bhuban badyakar life changed after getting viral
సోషల్ మీడియా(Social Media) ఎప్పుడు ఎవరిని వరిస్తుందో.. ఎవరిని కిందికి తొక్కుతుందో తెలియదు. కేవలం ఒక్క నైట్ లో అంతా మారిపోతుంది. ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్.. వంటి ప్లాట్ ఫార్మ్ లలో ఒక్క రాత్రిలో వైరల్ అయిన అదృష్టవంతులు ఎందరో ఉన్నారు. అందులో ఒకరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన భుబన్ బాద్యాకర్(Bhuban Badyakar) జీవితమే ఒక నిదర్శనం. అతడు 'కచ్చా బాదాం'(kacha badam) అనే ఒకే ఒక్క పాటతో ప్రపంచవ్యాప్తంగా అపారమైన కీర్తిని సంపాదించుకున్నాడు. ఈ పాటతో అతని జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది.
Also Read : మూవీ హిట్ తెలుసు కదా.. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో హిట్ కొట్టిన డీజే టిల్లు
కచ్చా బాదాం సింగర్ లైఫ్ ఛేంజ్
పశ్చిమ బెంగాల్(west bengal) లోని బీర్‌భూమ్ జిల్లా, కురల్జురీ గ్రామానికి చెందిన భుబన్ బాద్యాకర్.. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వీధుల్లో సైకిల్‌పై తిరుగుతూ పచ్చి వేరుశనగలు (బెంగాలీలో 'కచ్చా బాదాం') అమ్ముకునేవాడు. కస్టమర్లను ఆకర్షించడం కోసం తనదైన శైలిలో "బాదామ్ బాదామ్ కచ్చా బాదామ్..." అంటూ పాట పాడుతూ తిరిగేవాడు. అతను చిరునవ్వుతో అందరినీ పలకరించేవాడు. బెంగాల్ జానపద బావుల్ పాటల శైలిలో ఉన్న ఈ సాంగ్ స్థానికులను బాగా ఆకట్టుకునేది.
ఓ రోజు పాట పాడుతూ కచాబాదం అమ్ముతుండగా.. ఓ వ్యక్తి ఆ పాటను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది రాత్రికి రాత్రే వైరల్‌గా మారింది. వెంటనే ఆ పాటపై అనేక డ్యాన్స్‌లు, డబ్‌స్మాష్‌లు, రీమిక్స్‌లు వెల్లువెత్తాయి. బాలీవుడ్ నుంచి మొదలుకొని కొరియా, ఆఫ్రికా వంటి విదేశీ ప్రముఖులు కూడా ఈ పాటకు స్టెప్పులేయడంతో 'కచ్చా బాదాం' గ్లోబల్ సెన్సేషన్‌గా మారింది.
ఈ సాంగ్ వైరల్ కావడానికి ముందు రోజు వరకు రూ.200-రూ.250 మాత్రమే సంపాదించే భుబన్ బాద్యాకర్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక మ్యూజిక్ కంపెనీ అతనితో కలిసి ఈ పాటను అధికారికంగా రికార్డ్ చేసి, రీమిక్స్ చేసి విడుదల చేసింది. ఈ పాట ద్వారా అతనికి మొదట్లో రూ. 3 లక్షలు పారితోషికం లభించింది. స్టార్‌డమ్ రావడంతో భుబన్ వేరుశనగలు అమ్మడం మానేసి, పూర్తిస్థాయి సింగింగ్ కెరీర్‌పై దృష్టి సారించాడు.
అతడికి రియాలిటీ షోలలో కూడా అవకాశం లభించింది. కోల్‌కతాలోని ప్రముఖ పబ్‌లలో పాటలు పాడాడు. స్థానికులు అతన్ని గుర్తించడం, సెల్ఫీలు అడగడంతో భుబన్ క్రేజ్ పెరిగిపోయింది. ఇలా పాట ద్వారా వచ్చిన డబ్బుతో.. భుబన్ తన చిన్న గుడిసె నుంచి కొత్త ఇంటికి మారాడు. చిన్నగా ఉండే గుడెసె వదిలి ఒక పెద్ద ఇళ్లు కట్టుకున్నాడు. ఆ ఇళ్లు ఇప్పుడు వైరల్ గా మారడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది మాత్రమే కాకుండా భుబన్ సెకండ్ హ్యాండ్ కారును కూడా కొనుక్కున్నాడు. అయితే కారు డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో ప్రమాదానికి గురై గాయపడ్డాడు.
Also Read : డ్యూడ్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. హీరో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టాడా?
చేదు అనుభవం:
ప్రశంసలతో పాటు భుబన్ ఒక చేదు అనుభవాన్ని కూడా ఎదుర్కొన్నాడు. తన పాట కాపీరైట్ హక్కుల కోసం మ్యూజిక్ కంపెనీతో విభేదాలు వచ్చాయి. దీనిపై అతడు మాట్లాడుతూ.. ''ఇప్పుడు నాకు ఈ పాట కాపీరైట్ లేదు. ఎవరో నాకు పెద్ద కలలు చూపించారు. పత్రాలపై సంతకం చేయమని బలవంతం చేశారు. పాట హక్కులను లాక్కున్నారు." అని అతను తెలిపాడు. ఒక్క పాట ఒక సామాన్య వ్యాపారిని ఓవర్‌నైట్ సెలబ్రిటీగా ఎలా మార్చగలదో చెప్పడానికి భుబన్ బాద్యాకర్ ఉదాహరణ నిలుస్తుంది.