Telusu Kada Movie Twitter review: మూవీ హిట్ తెలుసు కదా.. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో హిట్ కొట్టిన డీజే టిల్లు

లేడీ డైరెక్టర్ నీరజ కోన, డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో నేడు "తెలుసు కదా" మూవీ థియేటర్లలో రిలీజైంది. ఇందులో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. మూవీ బాగుందని, సిద్ధు వన్ మ్యాన్ షో అని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.

New Update
Telusu kada

Telusu kada

లేడీ డైరెక్టర్ నీరజ కోన(Neeraja Kona), డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) కాంబోలో నేడు "తెలుసు కదా" మూవీ(Telusu Kada movie) థియేటర్లలో రిలీజైంది. ఇందులో రాశీ ఖన్నా(Rashi Khanna), శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్లుగా నటించారు. సిద్ధు జొన్నలగడ్డ సినిమా అంటే యూత్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. దీనికి తోడు మూవీ టీజర్, ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు ముందు నుంచే భారీగా ఉన్నాయి. అయితే నేడు థియేటర్‌లోకి వచ్చిన తెలుసు కదా మూవీ ఎలా ఉందో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Dude Movie Twitter Review: డ్యూడ్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. హీరో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టాడా?

వన్ మ్యాన్ షో సిద్ధు..

సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీలో వన్ మ్యాన్ షో చేశాడని చెప్పవచ్చు. కత్తి పట్టుకోకుండా, గన్ పట్టుకోకుండా కేవలం ఎమోషనల్‌గా సినిమాను హిట్ చేశాడని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. రొమాంటిక్ ఎమోషనల్ కామెడీతో ప్రేక్షకులను ఎంటర్‌టైనింగ్ చేశారని చెప్పవచ్చు. సిద్ధూ స్టోరీ సెలక్షన్ బాగుందని, క్యారెక్టరైజేషన్ కాస్త డిఫరెంట్‌గా ఉందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. అన్ని ఎమోషన్స్‌ను బాగా బ్యాలెన్స్ చేశారని అంటున్నారు. అలాగే హీరోయిన్లు రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి అందంతో మెస్మరైజ్ చేశారు. సిద్ధు కెరీర్‌లో బెస్ట్ ఫర్ఫార్మన్స్ అంటే ఇదేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాగే హర్ష కామెడీ కూడా బాగానే వర్క్‌వుట్ అయ్యిందని, డైలాగ్స్ సూపర్ ఉన్నాయని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. సినిమా మొత్తం మీద చూసుకుంటే అదిరిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా నీరజ కోన డైరెక్షన్ బాగుందని, మొదటి సినిమాతో హిట్ కొట్టిందని నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Kacha Badam singer : 'కచ్చా బాదాం' సింగర్ లైఫ్ ఛేంజ్.. పెద్ద ఇళ్లు, కారు - చూస్తే పిచ్చెక్కిపోతారు..!

Advertisment
తాజా కథనాలు