Dude Movie Twitter Review: డ్యూడ్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. హీరో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టాడా?

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన 'డ్యూడ్' (Dude) సినిమా నేడు థియేటర్లలోకి వచ్చింది. అయితే ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు వేయడంతో సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. డ్యూడ్ మూవీతో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టాడని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

New Update
Dude Twitter Review

Dude Twitter Review

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan Dude) నటించిన 'డ్యూడ్' (Dude Movie Twitter Review) సినిమా నేడు థియేటర్లలోకి వచ్చింది. అయితే ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు వేయడంతో సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. గతంలో ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ టుడే, డ్రాగన్ మూవీలో హిట్ అయ్యాయి. ఇప్పుడు డ్యూడ్ మూవీతో హ్యాట్రిక్ కొడతాడా? అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ట్వి్ట్టర్ రివ్యూలో చూద్దాం.

ఇది కూడా చూడండి: Ticket Hikes: దీపావళి సినిమాలకు నో టికెట్ హైక్స్.. పండక్కి రచ్చ రచ్చే..!

యూత్‌కు కనెక్ట్ అయ్యేలా..

యువ దర్శకుడు కీర్తీశ్వరన్ తెరకెక్కించిన ఈ డ్యూడ్ మూవీలో ప్రదీప్ రంగనాథన్ సరసన 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు, నేహా శెట్టి నటించారు. అలాగే సీనియర్ నటుడు శరత్ కుమార్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుందని ముందు నుంచే టాక్ ఉంది. ప్రదీప్ రంగనాథన్ సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. అయితే ఈ మూవీలో తండ్రి, కొడుకు మధ్య ప్రేమను చూపించే విధంగా ఉంటుందని తెలుస్తోంది. సినిమా అయితే బాగుందని నెటిజన్లు ట్విట్టర్‌లో ట్వీట్స్ చేస్తున్నారు. సినిమా ఫస్టాఫ్ అయితే అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు సినిమా కాస్త లవ్ టుడే ఫార్మా్ట్‌లో ఉందని మరికొందరు అంటున్నారు. 

ఈ మూవీలో ప్రదీప్ తన పాత్రలో చాలా బాగా నటించాడని.. ముఖ్యంగా ఫన్, ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడని ఫ్యాన్స్ ప్రశంసించారు. హీరోయిన్ మమితా బైజు(Mamitha Baiju Dude) తన సహజమైన నటన, అందంతో ఆకట్టుకుంది. ప్రదీప్‌తో ఆమె కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యిందని చెప్పవచ్చు. అలాగే మూవీ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అదిరిపోయిందని, యూనిక్‌గా ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే మూవీ సెకండ్ పార్ట్ కాస్త స్లోగా ఉందని, కథ కాస్త డిఫరెంట్‌గా రాసి ఉంటే బాగుండేదని నెటిజన్లు అంటున్నారు. పాటలు బాగున్న బీజీఎం అయితే పెద్దగా ఆకట్టుకోలేదని పలువురు చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే.. మూవీ అదిరిపోయిందని, ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్  కొట్టాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Prabhas Fauji: ప్రభాస్ కొత్త సినిమాకు టైటిల్ కష్టాలు.. కారణం పవన్ కల్యాణే..?

Advertisment
తాజా కథనాలు