JD Chakravarthy: స్టార్ హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకోమని వాళ్ల అమ్మే అడిగింది: కానీ ఆ విషయం తెలిసి!

స్టార్ హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకోమని ఆమె తల్లి తనను అడిగినట్లు నటుడు జేడీ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఓరోజు నటి మహేశ్వరి ఇంటికి వెళ్లగా..అక్కడ ఆమె తననుచూసి అలా అడిగిందన్నాడు. కానీ ఆమె మెంటల్ హెల్త్ బాగోలేకపోవడంతో సైలెంట్‌గా ఉన్నానని తెలిపాడు.

New Update
Sridevi Mother Requested Me To Marry her daughter Says JD Chakravarthy

Sridevi Mother Requested Me To Marry her daughter Says JD Chakravarthy

JD Chakravarthy: జేడీ చక్రవర్తి.. ఈ నటుడి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా తన నటనతో సినీ ప్రియులను ఆకట్టుకుంటాడు. హీరో, విలన్, ఫ్రెండ్ క్యారెక్టర్‌లో ఒదిగిపోతాడు. అంతేకాదండోయ్.. నిర్మాతగా, దర్శకుడిగా, మ్యూజిక్ కంపోజర్‌గా కూడా సత్తా చాటాడు. 

Also Read:  పెళ్లి కోసం ఆరాటంగా వెళ్లిన వరుడు..తీరా అక్కడ ట్విస్ట్‌ మామూలుగా లేదుగా!

ఇలా జేడీ చక్రవర్తి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞశాలిగా పేరు సంపాదించుకున్నాడు. ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ డైరెక్షన్‌లో నాగార్జున హీరోగా నటించిన శివ సినిమాతో జేడీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో విలన్‌గా తన అద్భుతమైన నటనను కనబరిచాడు. అక్కడ నుంచి మొదలైన ఆయన సినీ కెరీర్ ఒకానొక సమయంలో పీక్స్‌లో ఉండేది. 

Also Read:  తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..

కానీ జేడీ ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. గతంలో దయ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. ఈ సిరీస్‌కు దర్శకుడు కూడా ఆయనే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే జేడీ తన పెళ్లిపై గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

మా కూతురుని పెళ్లి చేసుకో

Also Read:  నరకం లాంటి జైల్లో వలసదారుల్ని వేస్తాం: ట్రంప్‌!

స్టార్ హీరోయిన్, అతిలోక సుందరి శ్రీదేవిని పెళ్లి చేసుకోమని ఆమె తల్లి తనను అడిగినట్లు జేడీ తెలిపాడు. ఒకరోజు హీరోయిన్ మహేశ్వరి ఇంటికి వెళ్లడంతో అక్కడ హీరోయిన్ శ్రీదేవి, వాళ్ల అమ్మ ఉన్నారని అన్నాడు. అయితే తనను చూసి శ్రీదేవి తల్లి వచ్చి మా కూతురుని పెళ్లి చేసుకో బాబు అని అగిందని తెలిపాడు. 

అసలు విషయం తెలిసి

Also Read:  అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్

జేడీ వ్యాఖ్యలు వైరల్‌..

వెంటనే గాల్లో తేలినంత పనయ్యింది. కానీ అసలు విషయం తెలిసి సైలెంట్ అయినట్లు చెప్పాడు. ఎందుకంటే శ్రీదేవి తల్లి అప్పటికే ఓ సమస్యతో బాధపడుతుందని.. ఆమె తలకు సర్జరీ జరిగిందని అన్నాడు. అయితే తలకు కుడివైపు సమస్య ఉంటే.. ఎడమవైపు సర్జరీ చేయడంతో.. ఆమె మెంటల్‌గా డిస్టర్బ్ అయినట్లు పేర్కొన్నాడు. అందువల్లనే ఆమె అలా అడిగినా సైలెంట్‌గా ఉండిపోయానని చెప్పుకొచ్చాడు. దీంతో జేడీ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు