IBOMMA క్లోజ్..  నిర్వహకుడు ఇమ్మడి రవి అరెస్ట్!

ఐబొమ్మ నిర్వహకుడు ఇమ్మడి రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లిలో సీసీఎస్ పోలీసులు ఓ ఆపార్ట్ మెంట్ లో  అదుపులోకి తీసుకున్నారు. నిన్న అంటే నవంబర్ 14వ తేదీన ఇమ్మడి రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు.

New Update
ibomma

ఐబొమ్మ(ibomma) నిర్వహకుడు ఇమ్మడి రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లిలో సీసీఎస్ పోలీసులు ఓ ఆపార్ట్ మెంట్ లో  అదుపులోకి తీసుకున్నారు. నిన్న అంటే నవంబర్ 14వ తేదీన ఇమ్మడి రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్(hyderabad) కు వచ్చాడు.

కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వహణకు పాల్పడుతున్నాడు.  ఐబొమ్మ వెబ్ సైట్ మొత్తం పైరసీ,  ఓటీటీలు ఉంటాయి. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో దమ్ముంటే పట్టుకోవాలంటూ ఐబొమ్మ నిర్వహకుడు ఇమ్మడి రవి  ఏకంగా సవాల్ కూడా చేశాడు.

Also Read :  Akhanda 2: బాలయ్య బాబు ‘తాండవం’.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సాంగ్

భార్యతో విడిపోయి ఒంటరిగా

ఇతను భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది.  ఇమ్మడి రవి అకౌంట్లో రూ. 3 కోట్లు ఉండగా వాటిని పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇక సర్వర్ లో ఉన్న మూవీ కంటెంట్(ibomma movies) ను కూడా పోలీసులు చెక్ చేశారు. సినిమాలు థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయిన గంటలోపే ఐబొమ్మలో వచ్చేస్తుంది. అయితే దీనివల్ల కోట్ల నష్టం వస్తుందని నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. నిర్వహకుడు అరెస్ట్ కావడంతో, ఐబొమ్మ వెబ్‌సైట్ పరిస్థితి ఏమిటనేది తదుపరి విచారణలో తేలనుంది. వెబ్‌సైట్ పూర్తిగా నిలిచిపోయిందా లేదా తాత్కాలికంగా మూతపడిందా అనే సమాచారం తేలాల్సి ఉంది. 

Also Read :  Kamini Kaushal Died: సినీ ఇండస్ట్రీలో విషాదం.. మరో నటి కన్నుమూత

Advertisment
తాజా కథనాలు