Hari Hara Veera Mallu First Review: వీరమల్లు ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఫ్యాన్స్ కు పూనకాలు.. బాక్సాఫీస్ బద్దలు!

పవన్ కల్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమా ప్రివ్యూలు అన్నిచోట్లా పడిపోయాయి. చాలా ఏళ్ళ తర్వాత పవన్ చేస్తున్న సినిమా ఇది. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సినిమా చూసి పిచ్చెక్కిపోతున్నారు. 

New Update
Hari Hara Veera Mallu Super Hit became this is Main reasons

Hari Hara Veera Mallu First Review

Hari Hara Veera Mallu First Review: మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మాణంలో జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), నిధి అగర్వాల్‌లు(Nidhi Agarwal) హీరో హీరోయిన్లుగా నటించారు. బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి తదితరులు నటించారు. హరిహర వీరమల్లు సినిమా 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఓవర్సీస్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని ప్రీమియర్లు ఈరోజు పడిపోయాయి. దీంతో సినిమా చూసిన వారు రివ్యూలు(Hari Hara Veera Mallu Review) ఇచ్చేస్తున్నారు. 

హరిహరవీరమల్లు సినిమా పిచ్చెక్కిస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. పులి, మేక సీక్వెన్స్ బ్లాస్టింగ్.. వర్త్ వర్మ వర్త్.. బీ, సీ సెంటర్స్‌లో థియేటర్స్ ఊగిపోతాయి. కుస్తీ ఫైట్ ఈ మధ్యకాలంలో వచ్చిన ది బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్‌‌లో ఒకటని అబిమాని ట్వీట్ చేశారు. వర్త్ వర్మా వర్త్ అంటూ ట్విట్టర్ రివ్యూ ఇచ్చారు. 

థియేటర్లు తగలబడకపోతే నన్ను అడుగు..

ఇక యూనిట్ ఇంటర్నల్ షో సందర్భంగా ఈ మూవీని చూసిన క్రిటిక్ తన రివ్యూను ట్విట్టర్‌లో(Hari Hara Veera Mallu Twitter Review) పోస్టు చేశారు. సినిమా అద్భుతమంటూ పొగడ్తల్లో ముంచెత్తేశారు. ఇదొక భావోద్వేగాల ఊగిసలాటని రాసుకొచ్చారు. తెలుగు సినిమా రంగంలో ఇప్పటి వరకు చూసిన పవన్ కల్యాణ్ ఒక ఎత్తు.. హరిహర వీరమల్లు సినిమాలో పవర్ స్టార్ మరో ఎత్తు. బాబీ డియోల్ క్యారెక్టర్ సర్‌ప్రైజ్. ఇంటర్వెల్‌కు 25 నిమిషాలు 3 ఎపిసోడ్స్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. డిప్యూటీ సీఎం రేంజ్‌కు సరిపోయే సినిమా(Block Buster HHVM). థియేటర్లు తగలబడకపోతే నన్ను అడుగు. సినిమాకు వెళ్ళినప్పుడు నాలుగు చొక్కాలు పట్టుకెళ్లండి అంటూ సలహా కూడా ఇచ్చారు. 

Also Read: రష్యా మహిళను బహిష్కరించొద్దు : కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

Advertisment
తాజా కథనాలు