/rtv/media/media_files/2025/07/12/russian-woman-found-living-in-cave-with-2-daughters-in-karnataka-2025-07-12-18-42-01.jpg)
Russian woman
Russian woman: గోకర్ణ సమీపంలోని ఓ గుహలో రహస్య జీవనం సాగిస్తున్న నైనా కుటినా (40) అనే రష్యన్ మహిళ తన ఇద్దరు కుమార్తెలు ప్రేయ (6), అమా (4)లతో ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆమెను దేశం నుంచి బహిష్కరించే విషయంలో పోలీసులు మల్లాగుల్లాలు పడుతున్నారు. కాగా ఈ విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నైనా కుటినా, ఆమె ఇద్దరు పిల్లల బహిష్కరణను ఆ రాష్ట్ర హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: పెళ్లమా..? దయ్యమా..? భయ్యా.. భర్త పార్ట్ కొరికి మింగేసింది..
కాగా, ఒక గుహలో ఉన్న వారిని పోలీసులు రక్షించి, ఒక రెస్క్యూ సెంటర్ కు తరలించారు. ఆ మహిళ వీసా గడువు ముగిసినప్పటికీ, ఆమెను బహిష్కరించకుండా, న్యాయపరమైన సహాయం అందించాలని కోర్టు ఆదేశించింది. రష్యాకు చెందిన నైనా కుటినా (40) అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి గోకర్ణ సమీపంలోని రామతీర్థ అడవుల్లోని ఒక గుహలో నివసిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఆమె వీసా గడువు 2017 లో ముగిసింది. పోలీసులు వారిని రక్షించి, బెంగళూరులోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ద్వారా ప్రాసెస్ చేసి, తుమకూరులోని ఒక రెస్క్యూ సెంటర్ కు తరలించారు.
Also Read : ఖమ్మంలో ప్రేమజంట ఆత్మహత్య.. ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రేయసి...చెట్టుకు ఉరేసుకుని ప్రియుడు..
కుటినా తన పిల్లలతో కలిసి సహజసిద్ధమైన జీవనశైలిని గడుపుతున్నారని, ఆమెకు ఎటువంటి హాని జరగలేదని, ఆమెను బహిష్కరించవద్దని కోరింది. ఆమె మాజీ భర్త, పిల్లల సంరక్షణ కోసం న్యాయపరమైన సహాయం కోరారు. కుటినాకు న్యాయపరమైన సహాయం అందించాలని, బహిష్కరణ చేయకుండా చూడాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ఆమె పిల్లలకు సంబంధించి సరైన ధ్రువీకరణ పత్రాలు లేవని కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయస్థానానికి తెలిపిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ వాదించారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన బాలల హక్కులను పరిగణనలోకి తీసుకొని బహిష్కరణను నిలుపుదల చేస్తున్నామని న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సునీల్ దత్‌పేర్కొన్నారు.
కాగా, తాజాగా ఆమెకు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. గత పదిహేనేళ్లుగా 20 దేశాలలోని అడవుల్లో గడిపిన తాను తన నలుగురు పిల్లలకు గుహలోనే జన్మనిచ్చినట్లు నైనా తెలిపింది. గోవా అడవుల్లోని ఓ గుహలో నివసిస్తున్న సమయంలో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది. కాగా ఆమె భర్త ఇజ్రాయెల్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త అని పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వ్యాపార వీసాపై భారత్‌లోనే ఉన్న నైనా కుటినా భర్తను విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) గుర్తించినట్లు జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: షాకింగ్ వీడియో.. యువతిని ఉతికారేశాడు - కడుపులో తన్ని, జుట్టు పట్టుకుని ఈడ్చేసిన యువకుడు!