Hari Hara Veera mallu Review: 'హరిహర వీరమల్లు' అరాచకం.. హైలైట్ సీన్స్ ఇవే!

 'హరిహర వీరమల్లు' ' నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్  మాత్రం హైలైట్ గా ఉన్నాయని ఫ్యాన్స్  చెబుతున్నారు. మరి ఆ హైలైట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

New Update

Hari Hara Veera mallu Review: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మోస్ట్ అవైటెడ్  'హరిహర వీరమల్లు' నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ గ్రాండ్ గా విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్(Hari Hara Veera Mallu Premiers), మార్నింగ్ షోలు పూర్తవగా.. సినిమా చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తమ రివ్యూలను పంచుకుంటున్నారు. ప్రస్తుతానికి పవన్ ఫ్యాన్స్ నుంచి ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది.  కొందరు సినిమా సూపర్ అంటుండగా, మరికొందరు మాత్రం ఓవరాల్ గా నిరాశపరిచిందని కొన్ని సీన్స్  మాత్రం హైలైట్ గా ఉన్నాయని  చెబుతున్నారు. మరి ఆ హైలైట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

కథ 

హరిహర వీరమల్లు స్టోరీ లైన్ చాలా బాగుందని చెబుతున్నారు. ఇది 17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబ్ పాలనలో జరిగే కథ. ఆ సమయంలో హిందువుల పై జరిగిన అణిచివేతను, దురాగతాలను చక్కగా  చూపించారని అంటున్నారు . 

పవన్ ఎంట్రీ సీన్ (Pawan Kalyan Entry Hari Hara Veera Mallu)

పవన్ ఎంట్రీ సీన్ సినిమాకే హైలైట్ ఉంటుందని అంటున్నారు. చాలా గ్రాండ్ గా, పవన్ ఫ్యాన్స్ కి కిక్కెకించేలా డిజైన్ చేశారని చెబుతున్నారు. ఎంట్రీ సీన్ సమయంలో  థియేటర్లు అభిమానుల కేకలతో దద్దరిల్లిపోయాయని టాక్. అలాగే  పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుందని చెబుతున్నారు. 

ఫస్ట్ హాఫ్ 

సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ కాస్త ఎంగేజింగ్ గా ఉంటుందని అంటున్నారు. 

కుస్తీ ఫైట్

సినిమాలో ఒక సీన్ లో కుస్తీ ఫైట్ చాలా  పవర్‌ఫుల్‌గా, అద్భుతంగా డిజైన్ చేశారని చెబుతున్నారు.

మాచిలీపట్నం పోర్ట్ ఫైట్ & చార్మినార్ చేజ్

సినిమాలో మాచిలీపట్నం పోర్ట్ ఫైట్ & చార్మినార్ ఛేజింగ్ యాక్షన్ సన్నివేశాలు  ఆకట్టుకునేలా ఉన్నాయని అంటున్నాయి. 

సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్: సినిమా సెకండ్ హాఫ్ లో  మొఘల్ పాలనలో ఉన్న గ్రామంలో జరిగే యాక్షన్ బ్లాక్ బాగుంటుందని చెబుతున్నారు. 

ఇంటర్వెల్ బ్యాంగ్ 

సినిమా ఇంటర్వెల్ సీన్ ట్విస్ట్  ప్రేక్షకులకు మంచి కిక్కిస్తుందని చెబుతున్నారు. ఇది సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు. అయితే ఇంటర్వెల్ సీన్ లో అల్లు అర్జున్ ఎంట్రీ ఉందని టాక్. 

ఎమోషన్స్

సినిమాలో నటీనటుల ఎమోషన్స్ బాగున్నాయని, కథకు తగ్గట్లు బాగా యాక్ట్ చేశారని చెబుతున్నారు. 

కీరవాణి మ్యూజిక్ 

 కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా సన్నివేశాలకు ప్రాణం పోసిందని చెబుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకు ఆయన బీజీఎమ్ అదిరిపోయిందని అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు