/rtv/media/media_files/2025/06/12/udY9NHZlc19NszScNvuL.jpg)
Gopichand33 Glimpse
టాలీవుడ్ యంగ్ హీరో గోపీచంద్‌కు హిట్ పడి చాలా కాలమే అయింది. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ ఏ ఒక్క సినిమా కూడా గోపీచంద్‌కు మంచి కంబ్యాక్ ఇవ్వలేదు. అయినా ఎక్కడా అతడు తన ఆత్మవిశ్వాన్ని కోల్పోలేదు. వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా ఏడాదికి ఒకటి రెండు సినిమాలు తీస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరొక కొత్త సినిమాతో వచ్చేందుకు సిద్ధమయ్యాడు.
Also Read : టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!
Gopichand33 Glimpse:
తన కెరీర్‌లో 33 వ సినిమా చేయబోతున్నాడు. ‘ఘాజీ’ చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్‌తో కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘#Gopichand33’ పేరుతో ప్రస్తుతం ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ సినిమాను చిట్టూరి శ్రీనివాస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇది ఏడవ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఒక విభిన్నమైన చారిత్రక కథ అని తెలుస్తోంది.
Also Read : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు దంచుడే దంచుడు
ఇవాళ గోపీచంద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి అదిరిపోయే గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్ చాలా బాగా చూపించారు. అంతేకాకుండా గోపీచంద్ లుక్ సైతం ఆకట్టుకుంటోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ గ్లింప్స్ చూసి ఎంజాయ్ చేయండి.
Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్‌పై కీలక నిర్ణయం!
Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !
latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news