Telangana Rain: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు దంచుడే దంచుడు

రాష్ట్రంలో నేటి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

Telangana Rain

గత కొద్ది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కుండపోత వర్షాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. 

Also Read: సోనమ్ మామూల్ది కాదయ్యా ..భర్తను చంపి ఫేస్బుక్లో పోస్టు.. హనీమూన్‌ కేసులో బిగ్ ట్విస్ట్!

Telangana Rain

భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటలకు 40 - 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. దీని వల్ల కుండపోత వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అందువల్ల పజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 

Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ జిల్లాలేవో పేర్కొంది. నిర్మల్, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షం పడనున్నట్లు తెలిపింది. 

Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్‌పై కీలక నిర్ణయం!

Also Read: ఈ నెలలోనే అమెరికా, భారత్ మధ్యంతర డీల్..500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం

 

telangana rain alert | rain update

Advertisment
Advertisment
తాజా కథనాలు