/rtv/media/media_files/2025/01/29/zGqO4MQ8PiEAjduXHi63.jpeg)
Jani Master Case, Flim Chamber
నటి ఝాన్సీ తన సోషల్ మీడియాలో జానీ మాస్టర్ (Jani Master) కేసుకు సంబంధించిన అప్డేట్ ను పోస్ట్ చేశారు. ఆయన మీ ఫిలిం ఛాంబర్ ఒక కేసును నెగ్గిందని చెప్పారు. వర్క్ ప్లేస్ లో లైంగిక వేధింపులు జరిగినట్లు ప్రూవ్ అయిన తర్వాత ఫిలిం ఛాంబర్ ఇచ్చిన ఆర్డర్లకు వ్యతిరేకంగా డిస్ట్రిక్ట్ కోర్ట్ ని జానీ మాస్టర్ ఆశ్రయించాడు. అయితే కోర్టు జానీ మాస్టర్ వేసిన అప్లికేషన్ ని తోసిపుచ్చింది. దీంతో వర్క్ ప్లేస్ లో మహిళలకు ఎంత ముఖ్యమైనది అనేది ప్రూవ్ అయిందని ఝాన్సీ అన్నారు. దాంతో పాటూ ప్రతీ సంస్థలో పోష్ రూల్స్ ఉండాలని కూడా మరోసారి రుజువైందని ఆమె అన్నారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఫెడరేషన్తో కలిసి ఈ విషయంలో పోరాడుతున్నందుకు ఝాన్సీ ధన్యవాదాలు తెలిపారు.
Also Read : తండేల్ హీరోయిన్ సాయి పల్లవికి అనారోగ్యం
Also Read : అక్కినేని ఫ్యాన్స్ కి పండగే .. తండేల్ ట్రైలర్ గూస్ బంప్స్
/rtv/media/media_files/2025/01/29/zGqO4MQ8PiEAjduXHi63.jpeg)
Also Read : తెలుగులో ఫ్లాప్.. హిందీలో 100 మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్ లో డబుల్ ఇస్మార్ట్ సర్ప్రైజ్!
Film Chamber Won The Jani Master Case
అంతకు ముందు మొట్టమొదటిసారిగా ఈ కేసు గురించి బాధితురాలు ఆర్టీవీ (RTV) కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కేసు విషయంలో వన్ సైడే ప్రచారం జరుగుతుందని, నేనే తప్పు చేశాననే అపోహ కలుగుతుందని వాస్తవాలు అందరికీ తెలియాలనే మీడియా ముందుకు వచ్చినట్లు మహిళా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Verma) స్పష్టం చేశారు. నేను తప్పు చేయలేదు కనుక మాస్క్ వేసుకుని ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకమ్మాయిని నిందితురాలిగా ఎందుకు చూస్తారు. ఒక ఫైటర్ గా ఎందుకు చూడరు అంటూ శ్రష్టి సమాజాన్ని ప్రశ్నించారు. నేను ఒంటరిగా ఫైట్ చేస్తున్నాను. సో నేను బాధితురాలిని కాదు ఫైటర్ ను కనుక మాస్క్ వేసుకోవలసిన అవసరం లేదు. నా లైఫ్ కోసం నేను ఫైట్ చేస్తున్నాను. నేను జీవితంలో ముందుకెళ్లాలనుకుంటున్నాను. నాలాగా గర్ల్స్ మందుకెళ్లాలి. నన్ను చూసి మిగిలినవాళ్లు స్ఫూర్తిపొందాలి. నేను కూడా బయటకు వచ్చి మాట్లాడుతాను అనుకోవాలి. సమాజం ఏదో అంటుంది. ఫ్యామిలీ ఏదో అంటుంది. స్నేహితులు అలా అంటారు అని ఆలోచించకుండా ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు.
Also Read: Big Breaking: కుంభమేళాలో తొక్కిసలాట ..17 మంది మృతి!