/rtv/media/media_files/2025/01/03/ZrmQjsyCYEByZOCK18Tf.jpg)
Mahakumbh Mela
ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) లో జరుగుతోన్న కుంభమేళా (Kumbh Mela) లో తొక్కిసలాట జరిగినట్లుగా సమాచారం అందుతోంది.త్రివేణి సంగమం ఘాట్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 17 మంది భక్తులు మరణించినట్లుగా తెలుస్తుంది.
ఈ మేరకు గాయపడిన వారిని భద్రతా సిబ్బంది, వాలంటీర్లు సమీపంలో సెంట్రల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
Also Read:Kumbhamela: కుంభమేళా కంటే లండన్ వెళ్లడమే చీప్.. ఆకాశాన్నంటుతున్న ఫ్లైట్ టికెట్ ధరలు!
మౌని అమావాస్య సందర్భంగా...
బుధవారం మౌని అమావాస్య (Mouni Amavasya) సందర్భంగా భక్తులు పుణ్య స్నానానికి భారీ ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
మౌని అమావాస్యను పురస్కరించుకుని మూడో అమృత స్నానం కోసం పెద్ద సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు తరలిరావడంతో బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మోదీ ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
నేడు మౌని అమావాస్య కావడంతో మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. దీంతో మహా కుంభమేళానికి వెళ్లే అన్ని రహదారుల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కైమూర్ జిల్లాలోని కుద్ర సమీపంలో ఎన్‌హెచ్ 19 రెండు లేన్లలో కూడా పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపుగా 50 కిలో మీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
కనీసం అంబులెన్స్ కూడా వెళ్లడానికి దారి లేకుండా వాహనాలు నిలిచిపోయాయి. దాదాపుగా 24 గంటల పాటు కొందరు ఈ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయారు. కొన్ని గంటల పాటు కనీసం వాహనాలు కదలకుండా ఒకే ప్రదేశంలో ఉన్నాయని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాగ్ రాజ్ వైపు వెళ్లే అన్ని రహదారులు కూడా వాహనాలతో నిండిపోయాయి. ఎటు చూసినా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో అమృత స్నానాలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read:Maharashtra: అలా చేశావేంటమ్మా.. చనిపోయాక ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు బాలిక సూసైడ్..
Also Read: Maha Kumbh: మహా కుంభమేళాలో హృదయ విదారక ఘటన.. తల్లిదండ్రులను వదిలేసిన కొడుకులు