Cinema: తండేల్ హీరోయిన్ సాయి పల్లవికి అనారోగ్యం

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరిగింది. దీనికి హీరోయిన్ సాయి పల్లవి హాజరు కాలేదు. ఆమెకు ఒంట్లో బాగోలేక పోవడం వల్లనే హాజరు కాలేకపోయిందని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు.  

New Update
thandel ott rights

Naga Chaitanya, Sai Pallavi

డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మూడవ చిత్రం తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగచైతన్య సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు. లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ మూవీ తరువాత మరో సారి వీళ్లిద్దరి కాంబో రిపీట్ కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. మత్స్య కారుల కథనంతో.. శ్రీకాకుళంలో జరిగిన యదార్థ సంఘటనలు ఆధారంగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 

సాయి పల్లవి రాలేదు...

తండేల్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లోని రామా టాకీస్ రోడ్ లో ఉన్న శ్రీరామా పిక్చర్ ప్యాలెస్ లో జరిగింది. దీనికి హీరో నాగచైతన్య, డైరెక్టర్, నిర్మాత అల్లు అరవింద్ అందరూ హాజరయ్యారు. అయితే హీరోయిన్ సాయి పల్లవి మాత్రం రాలేదు దానికి కారణం ఆమెకు ఒంట్లో బాగోలేకపోవడమే అని అల్లు అరవింద్ తెలిపారు. ఆమెకు కళ్ళు తిరుగుతున్నాయి అని...డాక్టర్ ప్రయాణాలు చేయవద్దని చెప్పారని...అందుకే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు రాలేదని చెప్పారు.  సినిమా డబ్బింగ్ కూడా సాయి పల్లవి జ్వరంతోనే చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. 

Also Read: Cricket: చేతులెత్తేసిన టీమ్ ఇండియా..మూడో టీ20లో ఇంగ్లాండ్ విజయం

Advertisment
తాజా కథనాలు