Vivo X200 FE: వివో నుంచి అరాచకమైన ఫోన్.. లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే - ఫీచర్లు హైలైట్!

Vivo భారత మార్కెట్లోకి త్వరలో Vivo X200 FEని తీసుకువస్తోంది. దీనిని రూ. 55వేలకు లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇది 6.31-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6500mAh బ్యాటరీ అందించారు.

New Update
Vivo X200 FE smartphone Launched soon

Vivo X200 FE smartphone Launched soon

Vivo భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువస్తోంది. త్వరలో Vivo X200 FEని విడుదల చేయనుంది. ఈ ఫోన్ ఇప్పటికే ఇతర మార్కెట్లలో లాంచ్ అయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ధర, ఫీచర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Also Read: కోల్‌కతా గ్యాంగ్‌ రేప్‌ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు

Also Read :  విమాన ప్రమాదంలో కుట్రకోణం.. కేంద్రం దర్యాప్తు!

Vivo X200 FE Specifications

Vivo X200 FE స్మార్ట్‌ఫోన్ 6.31-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది MediaTek Dimensity 9300+ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ Android 15 ఆధారంగా Funtouch OS 15పై పనిచేస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో 50MP సోనీ IMX921 సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. అదే సమయంలో సెల్ఫీ కోసం ముందు భాగంలో 50MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. 

ఈ ఫోన్‌ USB టైప్-సి పోర్ట్, స్టీరియో స్పీకర్లు, హై-రెస్ ఆడియోతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది. శక్తినివ్వడానికి 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6500mAh బ్యాటరీ అందించారు. X200 FE భారతదేశంలో నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి బ్లూ బ్రీజ్, ఎల్లో గ్లో, పింక్ వైబ్, బ్లాక్ లక్స్.

Vivo X200 FE Price

అంచనా ప్రకారం.. Vivo X200 FE భారతదేశంలో రూ. 55,000 ధర వద్ద లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్‌ త్వరలో రానుంది. 

Also Read: వీడెవ్వడ్ర బాబు.. భార్య విడాకులిచ్చిందనే కోపంతో రైలునే తగలబెట్టేశాడు

 

vivo-mobiles | telugu tech news | tech-news

Advertisment
Advertisment
తాజా కథనాలు