BIG BREAKING: హీరో వేణుపై కేసు!

హీరో వేణు పై హైదరాబాద్‌ పోలీస్‌ స్టేషన్ లో కేసు నమోదైంది.ఓ కన్‌స్ట్రక్షన్‌ కు సంబంధించిన విషయంలో వేణు పై కేసు నమోదైంది.సదరు సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు,ప్రోగ్రెసివ్‌ కన్‌స్ట్రక్షన్‌ నిర్వహకులు రద్దు చేసుకోవడంతో కంపెనీ ఎండీ ఫిర్యాదు చేశారు.

New Update
venu

venu

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు వేణు తొట్టెంపూడి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.తన సూపర్‌ యాక్షన్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈయన ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి కొన్ని సినిమాల్లో యాక్ట్‌ చేశారు. కానీ మళ్ళీ ఏమైందో తెలియదు కానీ ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అలాంటి ఈయన ఇన్నాళ్లు మీడియాకు దూరంగా ఉండి, ఇప్పుడు సడన్గా వార్తల్లో నిలిచారు.

Also Read: Top 10 Countries: ప్రపంచంలో టాప్‌ 10 శక్తిమంతమైన దేశాల జాబితా విడుదల.. భారత్ ఎన్నో స్థానమంటే ?

తాజాగా రూ.1000 కోట్ల స్కామ్ లో ఈయనపై కేసు నమోదైనట్లు సమాచారం. ఈ విషయం తెలిసి, అటు అభిమానులతో పాటు ఇటు సినీ సెలబ్రిటీలు సైతం షాక్‌ అవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే...ప్రముఖ నటుడు వేణు తొట్టెంపూడి, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకులు హేమలత, భాస్కరరావు, శ్రీవాణి, ఎండి పాతూరి ప్రవీణ్ పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మంగళవారం కేస్ నమోదు చేసినట్లు సమాచారం. 

Also Read: Bullet Train: హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు.. ముంబై, చెన్నై, బెంగళూరుకు ఇక గంటల్లోనే రయ్‌..రయ్‌!

పోలీసులు తెలిపిన వివరాల మేరకు గతంలో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ.. ఉత్తరాఖండ్ లో జల విద్యుత్ ప్రాజెక్టుకి సంబంధించిన ఒక పనిని తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సొంతం చేసుకుంది. బంజారాహిల్స్ లోని రిత్విక్ ప్రాజెక్ట్స్, స్వాతి కన్స్ట్రక్షన్స్ సబ్ కాంట్రాక్టుకి తీసుకున్నాయి. అయితే స్వాతీ కన్స్ట్రక్షన్స్ మధ్యలో తప్పుకోవడంతో రిత్విక్ ప్రాజెక్ట్ వారు 2002లో పనులు మొదలుపెట్టారు. ఇక ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్, బీ.హెచ్.డీ.సీ మధ్య వివాదం తలెత్తడంతో ఇరుపక్షాలు ఢిల్లీ కోర్టును ఆశ్రయించాయి. అటు పనులకు సంబంధించి రూ.1,010.25 కోట్లు డీహెచ్డీసీ ఖాతాలో జమ అయ్యాయి. 

రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ నిర్వహకులు రద్దు చేశారు. దీంతో ఎండీ రవికృష్ణ ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు ఛార్జీ షీట్ దాఖలు చేయగా.. నాంపల్లి రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ నిర్వహకులపై అలాగే వేణుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also Read: Trump: గాజాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ హెచ్చరికలు!

Also Read: Summer Effect: భగభగమంటున్న భానుడు..రానున్న 15 రోజులు జర జాగ్రత్త.. అధికారుల హెచ్చరికలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు