/rtv/media/media_files/2025/03/01/BliDrgvpPEO3qq6UlPKT.jpg)
Tollywood Heroes
Tollywood Heroes: తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలకు(Bollywood Producers) ఒక బంగారు అవకాశంలా కనిపిస్తోంది. అందుకు కారణం హిందీలో హీరోల రెమ్యూనరేషన్స్ కి తగ్గట్టుగా థియేటర్ వసూళ్లు రావడంలేదు. ఇక, తెలుగు సినిమాలు తక్కువ బడ్జెట్‌తో కూడా మంచి కలెక్షన్లను సాధిస్తూ ఉండడం బాలీవుడ్ నిర్మాతలను సైతం ఆకర్షిస్తోంది. అందుకే బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!
“కిల్” డైరెక్టర్ తో రామ్ చరణ్ మూవీ..
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కి మన తెలుగు సినిమాలతో మంచి అనుబంధమే ఉంది. తెలుగు సినిమాలను ప్రోత్సహించడంలో అయన ఎప్పుడూ ముందుంటాడు దీంతో, ఆయన తెలుగులో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. బాలీవుడ్‌లో రీసెంట్ గా వచ్చిన వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ “కిల్” సినిమాకు దర్శకత్వం వహించిన నగేష్ భట్‌తో కూడా తెలుగు సినిమా చేయాలనే యోచనలో ఉన్నారు కరణ్ జోహార్. గతంలో విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లి ఈ ప్రాజెక్టు గురించి చర్చలు జరిపినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడతని స్థానంలో రామ్ చరణ్‌తో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం
కరణ్ జోహార్ తెలుగులో తన మార్కెట్ మరింత పెంచుకోవడం కోసం, మిడ్-రేంజ్ సినిమాలు కూడా నిర్మించాలనుకుంటున్నాడు. సినిమా నిర్మాణ వ్యయం, మార్కెట్ దృష్టిలో ఉంచుకొని తెలివిగా అడుగులు వేస్తున్నాడు కరణ్ జోహార్. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్లకు హీరోల డేట్లు దొరకడం కష్టం అవుతుంది. ఇక హిందీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మన తెలుగు హీరోల కోసం చూస్తుంటే హీరోలు, వారి డేట్లు దొరకడం మరింత కష్టమైపోతుంది.
Also Read: HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి
ఇప్పటికే తమిళంలో నిర్మాతలు తగ్గు మొఖం పట్టారు. మన తెలుగు నిర్మాతలే అక్కడి హీరోలతో, దర్శకులతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు హిందీ నిర్మాతలు కూడా తెలుగు హీరోలకి మొగ్గు చూపుతుంటే ఒకరకంగా ఇది మన హీరోలకి మంచి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. కానీ, ఇది అందరి హీరోలకు వర్తించదు హిట్లు కొట్టిన వారికీ మాత్రమే ఆదృష్టం వరిస్తుంది.