Love Jihad: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. జౌన్‌పూర్‌లోని సివిల్ కోర్టులో ఓ హిందూ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి అక్కడికి వచ్చిన ముస్లిం వ్యక్తిని లాయర్లు తీవ్రంగా కొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

New Update
up love jihad

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. జౌన్‌పూర్‌లోని సివిల్ కోర్టులో ఓ దళిత హిందూ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి అక్కడికి వచ్చిన ముస్లిం వ్యక్తిని లాయర్లు తీవ్రంగా కొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  జౌన్‌పూర్‌లోని మనిహా గ్రామానికి చెందిన సల్మాన్ అనే వ్యక్తి  హిందూ యువతిని పెళ్లి చేసుకోవడానికి సివిల్ కోర్టుకు వచ్చాడు.  అయితే వీరిద్దరూ వేర్వేరు మతాలకు చెందినవారని తెలుసుకున్న కొంతమంది న్యాయవాదులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ  సల్మాన్‌పై దాడికి దిగారు.  దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతవరణం నెలకొంది. 

 ప్రేమ పేరుతో వల వేసి 

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. తదుపరి విచారణ కోసం అధికారులు ఆ సదరు హిందూ మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.  సల్మాన్ తమ కూతుర్ని  ప్రేమ పేరుతో వలలో వేసి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడని.. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకునుందుకు ప్రయత్నించాడని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. 

సల్మాన్ గతంలో కూడా ఇలాంటి ప్రయత్నం చేశాడని ఆ అమ్మాయి తల్లి కూడా ఆరోపించింది. ఆ మహిళ తల్లిదండ్రులు సల్మాన్ పై అధికారికంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Also read :  నామినేటెడ్‌ పదవులు వాళ్లకే.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు