HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లా నార్శింగ్ మండలం పుప్పాల గూడలో భారీ అగ్ని ప్రమాదం చోట చేసుకుంది. టూస్టోరీ బిల్డింగ్ లో మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ముగ్గురు మృతి చెందారు. ఇందులో ఒక పాప కూడా ఉంది. 

New Update
Fire Accident

Fire Accident

రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడలో  రెండు అంతస్తుల భవనంలో మంటలు ఘటన తీవ్ర విషాదాన్ని మిగుల్చింది. ఈ బిల్డింగ్ కు నిప్పంటుకుంది. దీంతో అక్కడ మొత్తం అంతా దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నా ఫలితం లేకపోయింది.  మొదటి గదిలో ఇద్దరు మహిళలు, ఒక పాప చిక్కుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది వారిని ప్రాణాలతో బయటకు తీసుకువచ్చారు. పొగ వలన అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ వారు ప్రాణాలు విడిచారని డాక్టర్లు చెప్పారు. మృతులను సిజిరా(7), సహానా(40), జమీలా(70)గా గుర్తించారు.

గ్యాస్ సిలెండర్లు పేలాయి..

భవనంలో ఉన్న మూడు గ్యాస్ సిలెండర్లు పేలడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. మిగతా వివరాలను సేకరిస్తున్నారు. అసలు మంటలెలా అంటుకున్నాయని ఆరా తీస్తున్నారు. బిల్డింగ్ లో ఉన్న మరో ఐదుగురిని సజీవంగా కాపాడగలిగారు.  సయంత్రం 5.30 కు తమకు ఫోన్ వచ్చిందని...అందులో గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలను అదుపు చేస్తున్నామని చెప్పారు. తాము వచ్చాక ఫైన ఫ్లోర్ లో ఐదుగురు ఉన్నారని చెప్పడతో లాడర్ వేసి డోర్ పగులకొట్ట లోపలికి ప్రవేశించామని తెలిపారు.  అక్కడ ఒక పాప, ఇద్దరు మహిళలు అపస్మారకస్థితిలో ఉండటంతో వారిని స్ట్రెచర్‌పై తీసుకొచ్చి.. అంబులెన్సులో ఆస్పత్రికి తరలించామని పోలీసు అధికారి వివరాలు చెప్పారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు