Andhra Pradesh: ఆ విద్యార్థుల కుటుంబాలకు రూ.3 లక్షల సాయం.. ఏపీ సర్కార్ కీలక ప్రకటన!

అనారోగ్య సమస్యలతో మరణించిన విద్యార్థుల కుటుంబానికి అండగా ఉండేందుకు రూ.3లక్షలు ఆర్థిక సాయం చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఇటీవల బాలుర గురుకుల పాఠశాలలో సాంఘిక సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

New Update
Dola Sree Bala Veeranjaneya SwamY

Dola Sree Bala Veeranjaneya SwamY

అనారోగ్య సమస్యలతో మరణించిన విద్యార్థుల కుటుంబానికి అండగా ఉండేందుకు రూ.3లక్షలు ఆర్థిక సాయం చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఇటీవల ప్రకాశం జిల్లా కురిచేడులో డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ బాలుర గురుకుల పాఠశాలలో సాంఘిక సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఇది కూడా చూడండి: Vivo X200 FE vs Oppo Reno 14 Pro 5G: చించేశాయ్ భయ్యా.. వివో, ఒప్పో కొత్త ఫోన్లు మైండ్ బ్లోయింగ్!

అన్ని సౌకర్యాలు కల్పిస్తామని..

ఈ క్రమంలో పాఠశాలలో ఉన్న పరిసరాలు అన్నింటిని పరిశీలించారు. పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. అలాగే విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తామన్నారు. రూ.143 కోట్లతో గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన బియ్యంతో భోజనం పెడుతున్నామన్నారు.

ఇది కూడా చూడండి:  Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ

అలాగే రాష్ట్రంలో ఐఐటీ, నీట్‌ ఉచిత కోచింగ్‌ సెంటర్లను పెంచినట్లు తెలిపారు. ఐఐటీ, నీట్‌లో ఎవరైతే విద్యార్థులు తక్కువ మార్కులతో సీట్ కొట్టలేరో వారికి లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే వసతి గృహాల్లో ఉన్నవారికి త్వరలో 11 రకాల వస్తువులతో కాస్మోటిక్స్‌ కిట్స్‌ అందజేయనున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చూడండి: Nimisha Priya: సంచలన అప్‌డేట్.. నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా

Advertisment
Advertisment
తాజా కథనాలు