/rtv/media/media_files/2025/07/15/high-court-orders-to-chiranjeevi-petition-2025-07-15-12-02-21.jpg)
high court orders to Chiranjeevi petition
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సంబంధించిన విషయంలో తెలంగాణ హైకోర్టు జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో చిరంజీవి.. జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను పరిశీలించి.. క్రమబద్దీకరణ చేయాలనీ జీహెచ్‌ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్)కి దరఖాస్తు చేసుకున్నారు. కానీ, చాలా కాలంగా జీహెచ్‌ఎంసీ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. తన దరఖాస్తును త్వరగా పరిష్కరించాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఈమేరకు జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఇటీవలే దీనిపై విచారణ జరపగా ఇరుతరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
కోర్టు ఆదేశాలు
పిటీషనర్ తరపు న్యాయవాది.. 2022లో ఇంటి పునరుద్ధరణలో భాగంగా జీ+2 నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నిర్మాణాన్ని తనిఖీ చేసి క్రమబద్ధీకరన చేయాలని కోరగా అధికారులు పట్టించుకోలేదని న్యాయస్థానికి వివరించాడు. మరోవైపు జీహెచ్‌ఎంసీ తరపు న్యాయవాది చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాదోపవాదనలు విన్న హైకోర్టు చిరంజీవి దరఖాస్తును చట్టం ప్రకారం నాలుగు వారాల్లోగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది.
Also Read: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!
ఇదిలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు విశ్వంభర, మరోవైపు అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికీ షూటింగ్ చివరి దశకు చేరుకున్న 'విశ్వంభర' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. వశిష్ఠ మల్లాడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతోంది. ఇందులో త్రిష ఫీమేల్ లీడ్ గా నటిస్తుండగా.. అషిక రంగనాథ్, రావు రమేష్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, కునాల్ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ళ తర్వాత త్రిష- మెగాస్టార్ మళ్ళీ ఈ సినిమాలో కలిసి కనిపించబోతున్నారు.
Also Read:తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!