పేర్ని నాని నోరు అదుపు పెట్టుకోకపోతే నాలిక చీరిస్తామని మంత్రి కొల్లు రవీంత్ర హెచ్చరించారు. హద్దు మీరి మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. తనపై పేర్ని నాని చేసిన అవినీతి ఆరోపణలపై ఫైర్ అయ్యారు. తనపై అవినీతి ఆరోపణలు చేసే అర్హత నానికి లేదన్నారు. తాతల కాలం నుండే తమ ఫ్యామిలీ వ్యాపార రంగంలో ఉందన్నారు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా వ్యాపారం చేసిన చరిత్ర తమదన్నారు. తన తండ్రి మచిలీపట్నంలో ఇండస్ట్రీ పెట్టి వందల మందికి ఉపాధి కల్పించారన్నారు. ఇసుక దోపిడీపై ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు.
నీకు దమ్ముంటే నిరూపించు..పేర్ని నానికి కొల్లు రవీంద్ర సవాల్.#PsychoFekuJagan#EndOfYCP#AndhraPradeshpic.twitter.com/gWh4NbzUpd
— Mana Rayalaseema Tdp (@TDP_Rayalaseema) July 15, 2025
కుటుంబాల్లో చిచ్చు పెడతారా?
కొడాలి నానితో కలిసి రేషన్ వాహనాల కొనుగోలులో నువ్వు వేల కోట్లు కమిషన్లు కొట్టుకోలేదా..? అని పేర్ని నానిని ప్రశ్నించారు. ఓటమి భయంతో నీ కొడుకుని నిలబెట్టి అడ్డదారులు తొక్కింది నువ్వు కాదా..? అంటూ ధ్వజమెత్తారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా చివరికి కుటుంబాల్లో కూడా చిచ్చు పెడతారా..? అని ప్రశ్నించారు. తమ తండ్రి రాసిన వీలునామా ప్రకారం తాము ఆస్తులు పంచుకున్నామన్నారు. న్యాయబద్ధంగా ఆస్తులు పంచుకుంటే దానిపై కూడా కామెంట్ చేస్తావా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై తాను లీగల్ గా వెళ్లబోతున్నానన్నారు.
ఇంజనీరింగ్ చదువుకున్న తన కొడుకు ఇండస్ట్రీ పెట్టుకుని పది మందికి ఉపాధి కల్పిస్తుంటే అతనిపై కూడా ఆరోపణలు చేస్తారా..!? అని ప్రశ్నించారు. నీలా నా కొడుకుని గంజాయి వ్యాపారం చేయమని వదలలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిచ్చి పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాను మహిళలను గౌరవించే వ్యక్తినని అన్నారు. రాజకీయాల కోసం రోడ్ల మీదకు మహిళలను తీసుకువచ్చే నీచాతి సంస్కృతి నీదంటూ.. పేర్నిపై ఫైర్ అయ్యారు.