Bigg Boss Telugu 9: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే.. హౌస్ నుంచి ఈ వీక్ ఆ కంటెస్టెంట్ ఔట్!

బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్‌లో ఫ్లోరా షైనీ, సంజన, ఇమాన్యూయేల్, తనూజ, శ్రష్ఠి, సుమన్, రీతూ చౌదరి, రాము రాథోడ్, డిమోన్ పవన్ ఉన్నారు. అయితే వీరిలో ఈ వారం హౌస్ నుంచి సంజన లేదా ఫ్లోరా షైనీ, సుమన్ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Bigg boss 9 telugu

Bigg boss 9 telugu

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్(bigg boss telugu season 9) ప్రేక్షకులు ఊహించినంత ఆసక్తిగా సాగడం లేదు. ప్రేక్షకులు కూడా బోర్‌గా ఫీల్ అవుతున్నారు. బిగ్ బాస్ అసలు మజాగా లేదని, చూస్తుంటే బోర్ ఫీలింగ్ వస్తుందని అంటున్నారు. కంటెస్టెంట్స్ కూడా నార్మల్‌గానే ఉన్నారని, పెద్దగా కామెడీ వంటివి చేయడం లేదని అంటున్నారు. బిగ్ బాస్ స్టార్ట్ అయి కేవలం రెండు రోజులు మాత్రమే అయ్యింది. అప్పుడే కంటెస్టెంట్స్ వారి ఆటను మొదలు పెట్టారు. అయితే మొదటి రోజే హౌస్‌లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఇమ్మానుయేల్ హరీష్‌ను గుండు అంకుల్ అంటాడు. దీంతో అతను ఫైర్ అయ్యి.. లిమిట్స్‌లో మాట్లాడమని చెబుతాడు. దీంతో అలా రెండో రోజు గడిచింది.

ఇది కూడా చూడండి: Bigg Boss Priya shetty: డాక్టర్ జాబ్ వదిలేసి బిగ్ బాస్ లోకి.. ప్రియా శెట్టి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!

ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్..

ప్రేక్షకులు ఎక్కువగా వీకెండ్‌లో వచ్చే నాగార్జున(Nagarjuna) కంటే సోమవారం జరిగే నామినేషన్స్‌(nominations) కోసం ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ఎవరెవరు నామినేషన్స్‌లో ఉన్నారని ముందుగానే తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆలోచిస్తుంటారు. అయితే ఈ వారం నామినేషన్స్‌లో సెలబ్రిటీస్ కంటెస్టెంట్స్‌తో పాటు కామనర్స్ కూడా ఉన్నారు. అయితే ఈ వారం నామినేషన్స్‌లో ఫ్లోరా షైనీ, సంజన, ఇమాన్యూయేల్, తనూజ, శ్రష్ఠి, సుమన్, రీతూ చౌదరి, రాము రాథోడ్, డిమోన్ పవన్ ఉన్నారు. అయితే వీరిలో ఈ వారం హౌస్ నుంచి సంజన లేదా ఫ్లోరా షైనీ, సుమన్ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయి రెండు రోజులే అయ్యింది. కానీ ఈ రెండు రోజుల్లో ఏ ప్రోమోలో లేదా షోలో కూడా సుమన్ అంతగా కనిపించడం లేదు.

ఇది కూడా చూడండి: BIGG BOSS PROMO: ఫుల్ ఫైర్!  ఆర్మీ జవాన్ VS సంజన.. సెలబ్రెటీలకు చుక్కలు చూపిస్తున్న కామనర్స్ !

అందరి కంటెస్టెంట్స్ టైప్ యాక్టివ్‌గా అయితే లేనట్లు ప్రేక్షకులు గమనించారు. ఒకప్పుడు తాను చేసిన కామెడీ ఇప్పుడు కనీసం అందులో ఒక శాతం కూడా ప్రవర్తించడం లేదని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కానున్నారో చూడాలి. ఇదిలా ఉండగా బిగ్ బాస్ టీం తాజాగా ఒక ప్రోమోను విడుదల చేయగా అందులో సంజనా, షైనీ మధ్య గొడవ జరగుతుంది. బాత్రూమ్‌లో ఉన్న వస్తువులు తీయమని షైనీ అన్నారు. వీటివల్ల క్లీన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందన్నారు. వీటిని సంజనా తీయను అంటే పవన్ కళ్యాణ్ వస్తాడు. దీంతో వీరి మధ్య వాగ్వాదం జరిగింది. 

Advertisment
తాజా కథనాలు