/rtv/media/media_files/2025/09/09/priya-shetty-2025-09-09-15-32-13.jpg)
priya shetty
Bigg Boss Priya shetty: బిగ్ బాస్ లోకి కామానర్ గా అడుగుపెట్టిన డాక్టర్ పాప ప్రియా శెట్టి తన క్యూట్ అండ్ బబ్లీ లుక్స్ నెటిజన్లను కట్టిపడేస్తుంది. మొదటి రోజు నుంచి హౌజ్ తన వాయిస్ వినిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ డాక్టర్ పాప గురించి తెలుసుకోవడానికి గూగుల్ లో, సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు ప్రియా శెట్టి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
ప్రియా శెట్టి బ్యాక్ గ్రౌండ్
ప్రియా శెట్టి రాయలసీమలోని కర్నూల్ కి చెందిన అమ్మాయి. చిన్నతనంలో యాక్టర్ వ్వాలని ఆశపడిన ఫ్యామిలీ కోసం డాక్టర్ అయ్యింది. అయితే ప్రియది సాంప్రదాయ కుటుంబం కావడంతో ఆమె తల్లిదండ్రులు యాక్టింగ్ చేయడానికి ఒప్పుకోలేదట. దీంతో ప్రియా తన తల్లిదండ్రులు మాట ప్రకారం మెడిసిన్ చేసింది.
Ilaanti wildfire thone audience ni impress chesi, Bigg Boss house loki enter avuthunna #PriyaShetty 🔥📷 The house doors are open! 📷#BiggBossSeason9 Playing Now only on #StarMaa#BiggBossTelugu9#BiggBossTelugu9GrandLaunchpic.twitter.com/CvBz4ekq0V
— bigboss9updateslatest (@bigboss7updates) September 7, 2025
మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత ప్రియా ఓ హాస్పిటల్ లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తుండగా బిగ్ బాస్ గురించి తెలుసుకుంది. ఇక ఇంట్లో వాళ్ళు కూడా ఆమెకు సపోర్ట్ చేయడంతో కామనర్స్ ఆడిషన్ కోసం అప్లై చేసుకుంది. బిగ్ బాస్ టీమ్ మొత్తం 40 మంది కామనర్స్ ని ఆడిషన్ ఇవ్వగా.. అందులో 15 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ 15మంది 'అగ్నిపరీక్ష' ప్రీషోలో ఒకరితో ఒకరు పోటీపడి చివరికి ఆరుగురు బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టారు.
ఈ ఆరుగురు కామనర్స్ లో ప్రియా శెట్టి ఒకరు. అగ్ని పరీక్ష నుంచే ప్రియా హంగామా మొదలు పెట్టింది. ప్రతీ టాస్కులో చలాకీగా ఆడుతూ, క్యూట్ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. 'అగ్నిపరీక్ష' లో ప్రియా.. శ్రీముఖి, నవదీప్ తో కలిసి చేసిన పెళ్లి చూపులు స్కిట్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. శ్రీముఖిని అత్తా.. అత్తా అని పిలుస్తూ నవ్వులు పూయించింది. మరి ఇప్పుడు బిగ్ బాస్ లో ఎలాంటి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో చూడాలి.
/filters:format(webp)/rtv/media/media_files/2025/09/09/priya-2025-09-09-15-33-54.jpg)
ప్రియకు ఇన్ స్టాగ్రామ్ లో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. రకరకాల ట్రెండీ అవుట్ ఫిట్స్ , వెకేషన్ ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 'అగ్నిపరీక్ష' లో సత్తాచాటి బిగ్ బాస్ లో అడుగుపెట్టిన రాయలసీమ బిడ్డ మరి టాప్ 5 కి చేరుకోగలుగుతుందా? లేదా ? అనేది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.