BIGG BOSS PROMO: బిగ్ బాస్ సీజన్ 9 లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. మొదటి రోజు పెద్దగా గొడవలేమి లేకుండా కూల్ గా సాగిన బిగ్ బాస్.. రెండవ రోజు రసవత్తరంగా ఉండబోతుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. హౌజ్ లో గొడవలకు అడ్డా అయిన కిచెన్, బాత్రూం విషయంలో కామనర్స్, సెలబ్రెటీల మధ్య చిచ్చు రేగింది. మాస్క్ మ్యాన్ హరిత హరీష్ - సీరియల్ నటి తనూజకు కుకింగ్ విషయంలో పెద్ద గొడవ జరిగింది. ప్రోమో చూస్తుంటే.. మాస్క్ మ్యాన్ ఉన్న ఫుడ్ నే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినాలని చెప్పగా.. తనూజ దానికి అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి.. తనూజ ఏడ్చే వరకు వెళ్ళింది.
సంజన VS పవన్ కళ్యాణ్
మరోవైపు బాత్రూం విషయంలో సంజన- ఆశ షైనీకి మాటల యుద్ధం జరిగినట్లు ప్రోమో కనిపించింది. దీంతో బాత్రూం క్లీనింగ్ మానిటర్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడు. సమస్యను పరిష్కరించేందుకు సంజనతో మాట్లాడాడు. కానీ, సంజన మాత్రం మానిటర్ పవన్ కళ్యాణ్ మాటను అంగీకరించకుండా మొండిగా వాదిస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఈవిడ చేసిన పని వల్ల నేను ఇంట్లోని లేడీస్ అందరికీ బాత్రూం యాక్సెస్ బ్లాక్ చేస్తాను అని చెప్పాడు. మరి ఈ గొడవ ఎంత వరకు వెళ్లిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
Owner #Kalyan’s shocking move! 🚪 Washroom closed down! 🚫
— Starmaa (@StarMaa) September 9, 2025
Watch #BiggBossTelugu9 Mon-Fri at 9:30PM, Sat & Sun at 9PM On #StarMaa & Stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9#StreamingNow#StarMaa#JioHotstarpic.twitter.com/RLwJXtKNfQ
హౌజ్ మేట్స్ ఎమోషనల్
గొడవలు పక్కన పెడితే ప్రోమోలో చాలా మంది హౌజ్ మేట్స్ ఎమోషనల్ అవడం కనిపించింది. రాము రాథోడ్, తనూజ, ఆశ షైనీ, శ్రేష్టి వర్మ కంట తడి పెట్టుకుంటూ కనిపించారు. కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్ గా సాగుతున్న ఈ గేమ్ లో కామానర్స్ కాస్త డామినేషన్ ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది. కామనర్స్ ని ఓనర్స్ గా ఇంట్లో ఉంచి.. సెలబ్రెటీలను ఔట్ హౌజ్ టెనెంట్స్ గా ఉంచారు బిగ్ బాస్. ఓనర్స్ కి వండి పెట్టడం, బట్టలు ఉతకడం దగ్గరి నుంచి అన్ని పనులు చూసుకునే బాధ్యత సెలబ్రెటీలది ( టెనెంట్స్). ఇక ఓనర్లుగా ఉన్న కామానర్లు బిగ్ బాస్ వద్దని చెప్పినప్పట్టికీ .. అప్పుడప్పుడు సెలబ్రెటీల దగ్గరికి వెళ్లి ఫుడ్ తినమని బతిమాలుతూ కెమెరా ముందు తమ మంచి తనాన్ని ప్రొజెక్ట్ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ప్రోమోలో శ్రీజ, ప్రియా శ్రేష్టి కి భోజనం తీసుకెళ్లి తినమని చెప్తారు. కానీ, రాము రాథోడ్ మాత్రం ''వద్దు.. తింటే బుక్కవుతాం'' అని చెప్పాడు. అప్పుడు శ్రీజ, ప్రియా తినకూడదని బిగ్ బాస్ ఏం చెప్పలేదు కదా? రాముతో వాదించారు.
Also Read: Aa Naluguru: అప్పులు చేసి చనిపోతే ఊరంతా కదిలొచ్చింది..ఆ నలుగురు సినిమా వెనుక రియల్ స్టోరీ!