సంధ్య థియేటర్ ఘటనతో సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకు అడ్డుకట్ట వేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలోనే ఇక నుంచి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి అవ్వమని సీఎం ఖరాఖండిగా చెప్పేశారు. అసలు ఈ బెనిఫిట్ షో చరిత్రేంటి? దీనివల్ల ఎవరు లాభ పడుతున్నారు. ఈ ట్రెండ్ ఎప్పుడు ఎలా మొదలైంది? బెనిఫిట్ షోల వల్ల నష్టపోయేది ఎవరు?.. Also Read : శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్‌రాజు.. ఘటనపై సంచలన కామెంట్స్! 90's నుంచే ఈ ట్రెండ్.. ఎన్టీఆర్, ఏ ఎన్నార్ కాలం నుంచే ఈ బెనిఫిట్ షోలు ఉన్నాయి. 2000 సంవత్సరం తర్వాత ఈ ట్రెండ్ మరింత ఎక్కువైపోయిది. అయితే అప్పుడు బెనిఫిట్ షోల ద్వారా వచ్చే డబ్బును మంచి పనులకు ఉపయోగించేవారు. వికలాంగులు, సినీ కార్మికుల సంక్షేమం కోసం, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సీఎం సహాయనిధి కోసం ఇండస్ట్రీ తరఫున ఆ డబ్బును ఇచ్చేవారు. అందుకే ప్రభుత్వం కూడా అప్పటికప్పుడు స్పెషల్ జీవోలను రిలీజ్ చేసేది. కానీ ఇప్పుడు చూస్తే ఈ ట్రెండ్ ను నిర్మాతలు, హీరోలు సొంత లాభాల కోసం వాడుకుంటున్నారు. భారీ బడ్జెట్లతో సినిమాలు తీసి.. హీరోలకు వందల కోట్ల రెమ్యూనరేషన్లు ఇచ్చేసి.. ఆ భారం తగ్గించుకోవటానికి బెనిఫిట్ షోలు వేసుకుంటున్నారు. హీరోలు మాత్రమే లాభపడటం కోసం బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తున్నారు. అట్టర్ ఫ్లాప్ సినిమాకు కూడా స్పెషల్ షోలు వేస్తున్నారు. సినిమా హిట్టో ఫట్టో జనానికి తెలిసేలోపే డబ్బులు లాగేస్తున్నారు. అసలు జనానికి ఆలోచించుకునే అవకాశం ఇవ్వడం లేదు. Also Read : మచిలీపట్నంలో విషాదం.. నిర్లక్ష్యం వల్ల ఏడేళ్ల బాలుడు మృతి వినోదం పేరుతో వ్యాపారం.. ఓ పెద్ద సినిమా రిలీజ్ ఉందంటే.. ముందే హైప్ క్రియేట్ చేసి.. టికెట్ రేట్లతో జనాన్ని బాదేస్తున్నారు. ఈ దోపిడీ సామాన్యుల్ని నలిగిపోయేలా చేస్తుంది. సినిమా పేరుతో సామాన్యుడికి వినోదం అందిస్తామని చెప్పి.. ఇలా టికెట్ రేట్లు పెంచేసి.. జనం డబ్బు గుంజడం ఎంత వరకు కరెక్ట్. అంటే ఇక్కడ వినోదం పేరుతో పెద్ద వ్యాపారమే రన్ చేస్తున్నారు. అసలు బెనిఫిట్ షోలు ఇవ్వాలని సర్కారుకు వినతిపత్రాలు ఇచ్చేరోజలు పోయి.. ఇప్పుడు ఏకంగా డిమాండ్లు చేస్తున్నారు. ఈ డిమాండ్స్ కు ప్రభుత్వం ఎలా పర్మిషన్ ఇస్తుందో వాళ్ళకే తెలియాలి. బెనిఫిట్ షోలే అనుకుంటే వాటికీ తోడు ఈ మధ్య ప్రీమియర్స్ అంటూ సినిమా రిలీజ్ కు ముందే జనాల జేబులు ఖాళీ చేస్తున్నారు నిర్మాతలు. నిజానికి ప్రీమియర్స్ అనేది ఒకప్పుడు ఓవర్సీస్ లో వేసేవాళ్ళు. అక్కడి ఆడియన్స్ సినిమాను ఒక్కరోజు ముందు చూసి టాక్ ఎలా ఉందో చెప్పేవాళ్ళు. Also Read : దమ్ముంటే పట్టుకోరా.. వివాదాస్పద సాంగ్ విడుదల చేసిన పుష్ప టీమ్! ఫ్యాన్స్ నే బలి చేస్తూ.. కానీ ఇప్పుడలా కాదు. సినిమా ఫలానా రోజు రిలీజ్ అవుతుంది. కానీ ఫ్యాన్స్ కోసం రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేస్తున్నాం.. అందరికంటే ముందు చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు అని ఇష్టమొచ్చిన రేట్లు పెంచుతారు. ఈ ప్రీమియర్స్ కు బలైయ్యేది హీరో ఫ్యాన్సే. అభిమానులు లేనిదే మేం లేమని స్పీచ్ లు ఇచ్చే హీరోలు.. అదే అభిమానుల దగ్గర నుంచి ఇలా డబ్బులు దోచుకోవడం ఏంటో? బెనిఫిట్ షో, ప్రీమియర్స్ పేరుతో నిర్మాతలు అధికారికంగా టికెట్ రేటు రూ.1000 నిర్ణయిస్తున్నారు. ఈ రేట్లతో నలుగురు సభ్యులున్న కుటుంబం సినిమాకి వెళ్తే టికెట్లకే రూ.4 వేలు అవుతాయి. మిగతా ఖర్చు ఓ రెండు వేలు వేసుకున్నా మొత్తం ఆరువేలు అవుతాయి. అంటే ఓ కుటుంబం సినిమాకి వెళ్లాలంటే రూ.6 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మొదటి మూడు రోజుల్లోనే భారీ కలెక్షన్లు లాగేయాలనే ప్లాన్ తో సినిమా వాళ్ళు.. బెనిఫిట్ షోను తమ సొంత బెనిఫిట్ కోసం ఉపయోగించుకుంటున్నారు. హీరోల రెమ్యూనరేషన్లు పెంచుకోవటానికి సామాన్యుడి ఇల్లు గుల్ల చేస్తున్నారు. Also Read : YEAR ENDER 2024: ఈ ఏడాది మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడైన కార్లు ఏంటంటే? తప్పంతా హీరోలదే.. ఇప్పుడున్న హీరోలు ఒక సినిమా హిట్ అయితే రెమ్యునరేషన్ భారీగా పెంచుతున్నారు. దానికి నిర్మాతలు 300కోట్లు, 500కోట్లు బడ్జెట్ పెట్టి ఆ డబ్బును రప్పించుకోవడానికి బెనిఫిట్ షో, ప్రీమియర్స్ అని భారీగా టికెట్ రేట్లు పెంచి జనాలను ఇబ్బంది పెడుతున్నారు. అదే హీరోలు రెమ్యునరేషన్స్ పెంచకుండా ఉంటే ఇవన్నీ ఎందుకు ఉంటాయి. అదే సాధారణ టికెట్ రేట్లతో సినిమా రిలీజ్ అవుతుంది. జనాలు కూడా ఎంచక్కా థియేటర్స్ లో సినిమాను ఎంజాయ్ చేస్తారు. టాక్ బాగుంటే సినిమా ఎక్కువ రోజులు ఆడుతుంది. లాభాలు కూడా అంత బాగా వస్తాయి. అప్పట్లో ఎన్టీఆర్, ఏ ఎన్నార్,చిరంజీవి లాంటి వాళ్ళు రెమ్యునరేషన్ పెంచాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించేవారు. కానీ ఇప్పటి హీరోలు మాత్రం ముందే రెమ్యునరేషన్ ఇంత కావాలని డిమాండ్ చేస్తున్నారు.