మచిలీపట్నంలో విషాదం.. నిర్లక్ష్యం వల్ల ఏడేళ్ల బాలుడు మృతి

అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. పార్క్‌లో ఆడుతుండగా.. కార్పొరేషన్ గేటు దినేష్ అనే బాలుడుపై పడగా మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోధిస్తున్నారు.

New Update
Krishna Accident

Krishna Accident Photograph: (Krishna Accident)

అధికారుల నిర్లక్ష్యం వల్ల కొందరు బలి అవుతున్నారు. స్కూల్, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ఎక్కడైనా ఏదైనా గేటు, తలుపులు వంటివి డ్యామేజ్ అయితే వాటిని మళ్లీ రిపైర్ చేయరు. ఏం కాదులే అని నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతుంటారు. ఇలాంటి ఘటన ఒక తాజాగా కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మచిలీపట్నం కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఏడేళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. 

ఇది కూడా చూడండి: అశ్విన్‌ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే! 

తలపై పడటంతో..

యూకేజీ చదువుతున్న దినేష్ అనే బాలుడు ఇంటికి దగ్గరలో ఉన్న మున్సిపల్ పార్క్‌లో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రహరీ గోడకు ఏర్పాటు చేసి బరువైన గేటు విరిగి పడి దినేష్ తలపై పడింది. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. దినేష్ చనిపోవడంతో కుటుంబ సభ్యుల రోధిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Allu arjun: అల్లు అర్జున్ విచారణ పూర్తి.. కీలక ప్రశ్నలకు సమాధానాలివే!

కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మరణించాడని ఆరోపిస్తున్నారు. తుప్పు పట్టి ఉన్న ప్రహరీ గోడ గేటు విరిగిపోయిన కూడా అధికారులు దాన్ని రిపైర్ చేయకపోవడం ఏంటని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న ఆ కుటుంబానికి తగు సాయం చేస్తామంటూ అధికారులు హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

ఇది కూడా చూడండి: Jani Master: అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్ వైరల్

తన బిడ్డ ప్రాణాల్ని కబళించిన గేటును చూసి ఎప్పటికప్పుడు దినేష్ తల్లి కన్నీరు మున్నీరవుతుంది. ఏదైనా సాయం దక్కుతుందన్న ఆశతో పది నెలలుగా అధికారులు చుట్టూ తిరిగి విజ్ఞప్తులు అందిస్తున్నా పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. బిడ్డను కోల్పోయిన బాధను దిగమింగుకుంటూ ఆ తల్లి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి ఇచ్చింది. ఇప్పటికైనా ఆమెకు సాయం దక్కుతుందో లేదో చూడాలి.

ఇది కూడా చూడండి: AP: ఏపీలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యానికి గర్భిణి మృతి..!


Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు