సంధ్య థియేటర్ ఘటనపై నిర్మాత దిల్ రాజ్ స్పందించాడు. శ్రీతేజ్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నాడు. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానన్నాడు. అల్లు అర్జున్‌ను కూడా కలుస్తానని చెప్పాడు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
Also Read : దమ్ముంటే పట్టుకోరా.. వివాదాస్పద సాంగ్ విడుదల చేసిన పుష్ప టీమ్!
FDC ఛైర్మన్ గా బాధ్యత నాదే..
ఇలాంటి ఘటన జరగడం నిజంగా దురదృష్టకరమని దిల్ రాజు అన్నాడు. శ్రీతేజ్ రికవరీ అవుతున్నాడని, త్వరలోనే పూర్తిగా కోలుకుని మన ముందుకు వస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. అలాగే బాధితురాలు రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో ఎదైనా ఉద్యోగం ఇప్పిస్తామన్నాడు. fdc ఛైర్మన్ గా ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీకి మధ్య సమస్యలు తలెత్తకుండా చూసుకుంటానని చెప్పాడు. ఇక ప్రభుత్వం తరఫున సినీ ఇండస్ట్రీకి అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశాడు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశామని, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పాడు. ఇలాంటి ఘటనలు ఎవరూ ఉద్దేశపూర్వకంగా చేయరని అన్నాడు. రెండు రోజుల్లోమరోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని చెప్పాడు.
ఇది కూడా చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్.. భారత్, పాక్ మధ్య మ్యాచ్ ఎప్పుడంటే?
విచారణలో అల్లు అర్జున్ ఆసక్తికర సమాధానాలు..
ఇదిలా ఉంటే.. సంధ్య థియేటర్ ఘటనపై 2 గంటలపాటు అల్లు అర్జున్ ను విచారించిన పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. పోలీసులు అడిగిన కీలకమైన 50పైగా ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయినట్లు తెలుస్తోంది. రేవతి చనిపోయిందని మీకు ముందే తెలుసు? మీకు రేవతి మరణ వార్త తరువాత రోజు తెలిసిందా? అనే ప్రశ్నకు కనీసం నోరు కూడా తెరవకుండా మౌనంగా ఉండిపోయిన బన్నీ.. రేవతి చనిపోయిన విషయం తర్వాత రోజే తెలిసిందని చెప్పాడు. ఇక అలాగే తొక్కిసలాటకు సంబంధించిన 10 నిమిషాల వీడియోను అల్లు అర్జున్‌కు చూపించి పోలీసుల ఇంటరాగేషన్ చేయగా కాస్త గందరగోళానికి గురైనట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని ప్రశ్నలకు మాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పిన అల్లు అర్జున్.. పలు కీలక ప్రశ్నలకు మాత్రం నోరు మెదపలేదని పోలీసులు తెలిపారు. CP, DCP మీకు ఆడిటోరియంలో కలిసారా? అనే ప్రశ్నకు.. వాళ్ళు ఎవరూ నన్ను కలవలేదు. మీడియాకి నాపై అవాస్తవాలు ప్రచారం చేసారని చెప్పినట్లు వెల్లడించారు.
Also Read : ఏపీలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యానికి గర్భిణి మృతి..!
Also Read : అల్లు అర్జున్ బౌన్సర్ అరెస్ట్