పుష్ప-2 నుంచి మరో సాంగ్ విడుదలైంది. దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్.. అంటూ సాగే సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. సంధ్య థియేటర్ లో తొక్కిసలాట విషయమై అల్లు అర్జున్ ను పోలీసులు ఈ రోజు విచారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పాటను విడుదల చేయడం చర్చనీయాంశమైంది. ఈ పాటను స్వయంగా అల్లు అర్జున్ పాడగా.. దర్శకుడు సుకుమార్ రాయడం విశేషం. సంధ్య థియేటర్ లో తొక్కిసలాట విషయంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ స్టేట్మెంట్.. అనంతరం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత పుష్పపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా అనేక సీన్లలో హీరో పోలీసులను అవమానించడంపై సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: Dil Raju: శ్రీతేజ్ తండ్రికి జాబ్.. నిర్మాత దిల్‌రాజు కీలక ప్రకటన!
సినిమాలోని సీన్లపై అభ్యంతరం..
ముఖ్యంగా ఓ ఎర్రచందనం స్మగ్లర్ ఐపీఎస్ అధికారి బట్టలు విప్పించడం లాంటి సీన్లు ఎంటని దుమ్మెత్తి పోస్తున్నారు. మంత్రి సీతక్క సైతం ఈ అంశంపై నిన్న మాట్లాడారు. స్మగ్లింగ్ చేసేవాడు హీరో ఎంటని ఫైర్ అయ్యారు. జై భీమ్ లాంటి సీనిమాలకు అవార్డులు రాకుండా ఇలాంటి సినిమాలకు అవార్డులు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇంత వివాదం నెలకొన్న వేళ.. పోలీసులకు సవాల్ విసినట్లుగా సాగే ఈ పాటను విడుదల చేయడంతో సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: Allu arjun: అల్లు అర్జున్ విచారణ పూర్తి.. కీలక ప్రశ్నలకు సమాధానాలివే!
సరైన సమయంలో పాటను విడుదల చేశారంటూ బన్నీ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు అవసరమా.. తగ్గించుకుంటే మంచిది అంటూ మరికొందరు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ పాట మరో కొత్త వివాదానికి దారి తీస్తుందా? లేదా సినిమా పాటగానే చూసి వదిలేస్తారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరో వైపు సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనపై నేడు అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ను A18గా చేర్చారు.