/rtv/media/media_files/2025/11/02/andhra-king-taluka-2025-11-02-17-00-36.jpg)
Andhra King Taluka
Andhra King Taluka: హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా' షూటింగ్ పూర్తయింది. చివరి పాట చిత్రీకరణతో ఈ సినిమా ప్రొడక్షన్ పనులు ముగిశాయి. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో రామ్- భాగ్యశ్రీ బోర్సేలపై ఈ పాటను చిత్రీకరించారు. పాపులర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్రబృందమంతా కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను హీరో రామ్ తన ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ.. ఒక ఎమోషనల్ నోట్ పంచుకున్నారు. మొత్తానికి షూటింగ్ పూర్తయింది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో నన్ను భాగం చేసినందుకు దర్శకుడు మహేష్ బాబుకు కృతజ్ఞతలు అని తెలిపారు.
Finally wrapped the shoot.
— RAm POthineni (@ramsayz) November 2, 2025
A film I’m proud of..
A film we will all be proud of..Soon!
Thank you @filmymahesh for this beautiful film in my career.#AndhraKingTaluka is coming to you..#AKTonNOV28pic.twitter.com/obNzzH5lcx
Also Read : అక్టోబర్ బాక్సాఫీస్ లెక్కలు.. మూడు హిట్లు, మిగిలినవన్నీ ..?
ప్రమోషన్స్ షురూ..
షూటింగ్ పూర్తికావడంతో మూవీ టీమ్ ప్రమోషనల్ కార్యక్రమాలను షురూ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో రామ్ కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర వీరాభిమాని పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, ఇతర ప్రచార చిత్రాలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా వివేక్ అండ్ మెర్విన్ మ్యూజిక్ హైలైట్ సినిమాకు హైలైట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి.
రామ్ కమ్ బ్యాక్
రామ్ రీసెంట్ ఫిల్మ్న్స్ 'ది వారియర్', 'స్కంద', 'డబుల్ ఇస్మార్ట్' బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. బ్యాక్ టూ బ్యాక్ రామ్ అభిమానులకు నిరాశే మిగిలింది. దీంతో ఇప్పుడు రాబోయే 'ఆంధ్రా కింగ్ తాలూకా' పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా రామ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ కావాలని ఆశిస్తున్నారు.
Also Read: SSMB29: రాజమౌళితో మహేష్ బాబు గొడవ.. ఎక్స్ లో వైరలవుతున్న చాటింగ్!
Follow Us