/rtv/media/media_files/2025/11/02/october-box-office-2025-11-02-16-27-01.jpg)
October box office
CINEMA: అక్టోబర్ నెల తెలుగు సినిమాలకు పెద్దగా కలిసి రాలేదు. ఈ నెల దసరా, దీపావళి పండగలు ఉండడంతో బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందు వచ్చాయి. ఏకంగా పదికి పైగా సినిమాలు విడుదలవగా.. అందులో కేవలం ఒక మూడు మాత్రమే చెప్పుకోదగ్గ విజయం సాధించాయి. మిగతా సినిమాలన్నీ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నాయి. అక్టోబర్ నెల బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
అక్టోబర్ మొదటి వారం
అక్టోబర్ తొలి వారంలో తెలుగు నుంచి స్ట్రయిట్ సినిమాలేమి లేకపోవడంతో డబ్బింగ్ సినిమాలు బరిలోకి దిగాయి. ధనుష్ ' ఇడ్లీ కొట్టు', రిషబ్ శెట్టి 'కాంతారా చాప్టర్ 1' విడుదలయ్యాయి.
వీటిలో ధనుష్ ఇడ్లీ కొట్టు నిరాశపరచగా.. కాంతారా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేస్కుకుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంచనాలకు తగ్గట్లే ఆకట్టుకుంది. మొదట్లో మిక్స్డ్ టాక్ వినిపించినప్పటికీ.. ఆ తర్వాత జనాల పాజిటివ్ టాక్ తో ఊపందుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. నాలుగు వారాల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
రెండవ వారం చిత్రాలు
రెండో వారం 'అరి', 'కానిస్టేబుల్', 'మటన్ షాప్', 'శశివదనే' వంటి కొన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో శశివదనే, కానిస్టేబుల్, మటన్ షాప్ అసలు ఊసే లేదు.
వీటిలో 'అరి' చిత్రం మాత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా.. కేవలం మౌత్ టాక్ ద్వారా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. అరిషడ్వర్గాలు (కామం, క్రోధం, లాభం, మొహం, మదం, మాత్సర్యం ) అనే ఒక కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
దీపావళి పోటీ
ఆ తర్వాత మూడోవారం దీపావళి పండగ కానుకగా ఏకంగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. కే- ర్యాంప్, డ్యూడ్, మిత్రమండలి, తెలుసు కదా సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కే- ర్యాంప్, డ్యూడ్ విజయకేతనం ఎగరవేశాయి. కుర్ర హీరో ప్రదీప్ రంగనాథన్ తమిళ్ ఫిల్మ్ డ్యూడ్ వసూళ్లు తెలుగు స్ట్రెయిట్ హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోలేదు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
సిద్దు జొన్నలగడ్డ 'తెలుసు కదా' భారీ హైప్ తో విడుదలైనప్పటికీ.. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటివరకు సిద్ధూ నుంచి వచ్చిన సినిమాల్లో ఇది చాలా వీక్ సినిమాగా నిలిచిందని ప్రేక్షకుల అభిప్రాయం.
చివరిగా బాహుబలి: ది ఎపిక్ రీరిలీజ్, రవితేజ మాస్ జాతర సినిమాలతో అక్టోబర్ సినిమాల సందడి ముగిసింది. మాస్ జాతర స్ట్రయిట్ రిలీజ్ అయినప్పటికీ.. బాహుబలి ముందు నిలవలేకపోయింది. ఒక స్టార్ హీరో సినిమాకు ఉండాల్సిన కనీసం బజ్ కూడా ఈ సినిమాకు దక్కలేదు.
మొత్తంగా అక్టోబర్ నెలలో దసరాకు కాంతారా చాప్టర్ 1, దీపావళికి డ్యూడ్, కే- ర్యాంప్ చిత్రాలు బాక్సాఫీస్ హీరోలుగా నిలిచాయి. మిగిలిన సినిమాలన్నీ అంచనాలకు తగ్గట్లు పెదగ్గా ఆకట్టుకోలేకపోయాయి.
Follow Us