Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈరోజు తన 60వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. సినీ తారల నుంచి సెలబ్రెటీల వరకు షారుఖ్ కి సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. కింగ్ బర్త్ డే పోస్టర్లు, ఎడిట్స్ తో సోషల్ మీడియా నిండిపోయింది. అయితే నేడు కింగ్ బర్త్ డే సందర్భంగా ఆయన తదుపరి ప్రాజెక్ట్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. పఠాన్ సూపర్ హిట్ తర్వాత షారుఖ్- సిద్ధార్థ్ ఆనంద్ కలిసి మరో సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ మూవీ టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు . ఈ చిత్రానికి 'కింగ్' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలిపారు. దీంతో పాటు చిన్న టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోను కూడా పంచుకున్నారు. ఇందులో షారుఖ్ ఫుల్ వైలెంట్ మోడ్ లో కనిపించారు.
షారుఖ్ క్రూరమైన లుక్
షారుఖ్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో షారుఖ్ పూర్తిగా కొత్త లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచారు. గ్రే హెయిర్ స్టైల్ తో చాలా క్రూరమైన యాక్షన్ అవతార్ లో కనిపించారు. టీజర్ లోని ఒక షాట్ లో షారుక్ ముఖం నిండా రక్తపు మరకలతో 'కింగ్ ఆఫ్ హార్ట్స్' కార్డును పట్టుకుని కనిపించారు. "వంద దేశాల్లో నేను బద్నామ్ అయ్యాను.. ప్రపంచం నాకిచ్చిన ఒకే ఒక్క పేరు... కింగ్'' అనే డైలాగ్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది.
Darr nahi, Dehshat hoon- #KING#KingTitleReveal is out now- https://t.co/HL5qCgss7r
— Shah Rukh Khan (@iamsrk) November 2, 2025
In Cinemas 2026 pic.twitter.com/4JACdDvqV5
చూస్తుంటే.. ఇదొక హై- యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది సుహానా ఖాన్ నటిస్తున్న మొదటి ఫీచర్ ఫిల్మ్. దీంతో షారుక్ అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Dadasaheb Phalke Awards 2025: ప్రభాస్ 'కల్కి' చిత్రానికి మరో అరుదైన గౌరవం! అవార్డుల ఫుల్ లిస్ట్ ఇదే
Follow Us